
PBKS vs LSG IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 54వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో అధిపత్యం ప్రదర్శించి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించింది. దీంతో పాయింట్ల పట్టికలో 15 పాయింట్లతో పంజాబ్ టీమ్ రెండో స్థానంలోకి చేరింది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, శశాంక్ సింగ్ సూపర్ బ్యాటింగ్ తో పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది.
ప్రభ్ సిమ్రాన్ సింగ్ 91 పరుగుల సూపర్ నాక్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. శ్రేయాస్ అయ్యర్ 45 పరుగుల ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. చివరలో శాశాంక్ సింగ్ 33 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. జోస్ ఇంగ్లీస్ 30 పరుగులు చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
237 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన రిషబ్ పంత్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ టాపార్డర్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ లు రాలేదు. దీంతో పంజాబ్ టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పంజాబ్ చేతిలో లక్నో టీమ్ 37 పరుగుల తేడాతో ఓడిపోయింది.