
IPL 2024 Auction LIVE updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ప్లేయర్స్ వేలం షురూ అయింది. వేలంలో ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. హ్యారీ బ్రూక్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ బిడ్ తెరవగా, రాజస్థాన్ రాయల్స్ మరోసారి బిడ్ లో చేరింది. చివకు ఢిల్లీ క్యాపిటల్స్ బ్రూక్ ను రూ.4 కోట్లకు దక్కించుకుంది.
హ్యారీ బ్రూక్ కనీస ధర రూ.2 కోట్లు వేలానికి రాగా, ఢిల్లీ క్యాపిటల్స్ రూ.4 కోట్లకు దక్కించుకుంది. గతేడాది ఇతడిని సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.13.25 కోట్లకు సొంతం చేసుకుంది. 24 ఏళ్ల హ్యారీ బ్రూక్ అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతమైన ఆటతో ముందుకు సాగుతున్నాడు. టెస్టు క్రికెట్లో కీలక పాత్రలు పోషించి, 2022 నవంబర్లో టీ20 వరల్డ్ కప్ లో గెలిపించాడు. కానీ అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగిన 50 ఓవర్ల ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ గ్రూప్ స్టేజ్ నిష్క్రమణలో 28.16 సగటుతో పోరాడాడు. కుడిచేతి వాటం బ్యాట్స్ మన్ ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఏడు బంతుల్లో 31 పరుగులు చేసి ఇంగ్లండ్ కు గట్టి విజయాన్ని అందించాడు.
IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలం షురూ.. రోవ్‌మాన్ పావెల్ కు భారీ ధర..