టాస్ వేశాక కూడా టీమ్‌ని డిసైడ్ చేసే ఛాన్స్... ఐపీఎల్ 2023లో టీమ్స్‌కి మరో బోనస్...

By Chinthakindhi Ramu  |  First Published Mar 22, 2023, 4:47 PM IST

టాస్ వేసిన తర్వాత ప్లేయింగ్ ఎలెవన్, ఇంపాక్ట్ ప్లేయర్‌ని డిసైడ్ చేసే అవకాశం కల్పించిన బీసీసీఐ... ఐపీఎల్ 2023 సీజన్ కోసం అదనపు మసాలాలు జోడిస్తున్న మేనేజ్‌మెంట్.. 


ఐపీఎల్‌ వచ్చాక క్రికెట్ రూల్స్ చాలా మారాయి. పవర్ ప్లే, ఫీల్డింగ్ మార్పులు, డీఆర్‌ఎస్, ఫ్రీ హిట్.. ఇలా క్రికెట్‌లో అనేక మార్పులను తీసుకొచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఈసారి మరిన్ని కొత్త కొత్త మార్పులతో రంగంలోకి దిగనుంది...

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో వైడ్ బాల్‌కి, హైట్ నో బాల్‌కి రివ్యూ తీసుకునేందుకు ప్లేయర్లకు అవకాశం కల్పించింది బీసీసీఐ. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 టోర్నీలోనూ దీన్ని ఫాలో చేయబోతున్నారు...

Latest Videos

ఐపీఎల్‌లో ఇంతకుముందు చాలా సార్లు అంపైర్లు ఇచ్చిన వైడ్ బాల్, నో బాల్ నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. కొన్నిసార్లు వైడ్ ఇవ్వకపోవడం వల్ల మ్యాచ్ రిజల్టే మారిపోయింది. ఐపీఎల్ 2019 సీజన్‌లో అంపైర్ నో బాల్ ఇచ్చి, తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో డగౌట్‌లో కూర్చున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, క్రీజులోకి వచ్చి మరీ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. నిబంధనలకు విరుద్ధంగా బ్యాటింగ్ టీమ్ కెప్టెన్, మ్యాచ్ జరుగుతుండగా క్రీజులోకి రావడం, అది కూడా మాహీ లాంటి లెజెండరీ క్రికెటర్ ఇలా చేయడం సెన్సేషన్ క్రియేట్ చేసింది...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కెప్టెన్ రిషబ్ పంత్, ఓ మ్యాచ్‌లో అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో ఆవేశానికి లోనై, తన టీమ్ మేట్స్‌ని ఆడడం ఆపేసి వచ్చేయాల్సిందిగా సిగ్నల్ ఇవ్వడం పెను దుమారమే క్రియేట్ చేసింది. ఇకపై అలాంటివి జరగకుండా వైడ్ బాల్‌ని కూడా డీఆర్‌ఎస్ తీసుకునే అవకాశం దక్కనుంది..

తాజాగా ఐపీఎల్‌ 2023 సీజన్‌లో టాస్ అయిన తర్వాత ప్లేయింగ్ ఎలెవన్‌ని డిసైడ్ చేసే అవకాశం కల్పించనుంది బీసీసీఐ. సాధారణంగా టాస్ వేయడానికి ముందే ఇరు జట్ల కెప్టెన్లు, తమ ప్లేయింగ్ ఎలెవన్‌ని తీసుకొచ్చి, మ్యాచ్ రిఫరీకి సమర్పించాలి...

అయితే టాస్ తర్వాత టీమ్‌ని నిర్ణయించుకునేందుకు అవకాశం కల్పించనుంది బీసీసీఐ. అంటే టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ చేయాలనుకుని ఓ 11 మందిని డిసైడ్ చేసిన కెప్టెన్, టాస్ ఓడిపోతే.. టీమ్‌లో మార్పులు చేయాలని అనుకోవచ్చు. తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే చాహాల్‌కి బదులుగా రియాన్ పరాగ్‌ని ఆడించాలని అనుకోవచ్చు.

అలాంటి సమయంలో టీమ్‌ని మార్చుకునేందుకు టాస్ వేసిన తర్వాత కూడా జట్లకు అవకాశం కలగనుంది. అలాగే ఐపీఎల్ 2023 సీజన్‌ నుంచి తీసుకురాబోతున్న ఇంపాక్ట్ ప్లేయర్‌ని కూడా టాస్ వేసిన తర్వాత డిసైడ్ చేసే ప్లేయింగ్ ఎలెవన్‌తోనే రిఫరీకి సమర్పించాలి.. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత ఎప్పుడైనా ఓ ప్లేయర్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌ని ఆడించేందుకు ఫ్రాంఛైజీలకు అవకాశం ఉంటుంది.. 

10 ఫ్రాంఛైజీలతో మొదలైన ఐపీఎల్ 2022 సీజన్‌ అనుకున్నంతగా జనాదరణ దక్కించుకోలేకపోయింది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అట్టర్ ఫ్లాప్ కావడంతో పాటు పెద్దగా క్రేజ్ లేని కొత్త జట్లు గుజరాత్ జెయింట్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ చేరడం కూడా ఐపీఎల్ 2023 వ్యూయర్‌షిప్‌ని దెబ్బ తీసింది. దీంతో ఐపీఎల్ 2023 సీజన్‌కి క్రేజ్ తెచ్చేందుకు అదనపు హంగులు అద్దుతోంది బీసీసీఐ.

click me!