కోల్కతాకు కెప్టెన్సీ కష్టాలు.. రేసులో ఆ నలుగురు.. మరి పఠాన్ మనసులో ఉన్నదెవరు..?

Published : Mar 24, 2023, 07:43 PM IST
కోల్కతాకు కెప్టెన్సీ కష్టాలు.. రేసులో ఆ నలుగురు.. మరి పఠాన్ మనసులో ఉన్నదెవరు..?

సారాంశం

IPL 2023: కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ లో అయ్యర్ కాకుంటే కెప్టెన్సీ రేసులో  ఎవరున్నారు..? ఆ జట్టు అభిమానులను ఇప్పుడు ఈ ప్రశ్నే  ఆందోళనకు గురిచేస్తున్నది. 

ఐపీఎల్-16 కు సమయం ముంచుకొస్తున్నది. ఒక పక్క మిగతా ఫ్రాంచైజీలు  ఆటగాళ్లతో సన్నాహక శిబిరాలు,   టీమ్ క్యాంప్స్ తదితర ఏర్పాట్లతో బిజీగా ఉంటే   రెండు సార్లు ఐపీఎల్ విజేత కోల్కతా నైట్ రైడర్స్  పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది.  ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా   ఈ లీగ్ లో  ఆడేది అనుమానంగానే ఉంది.  ఒకవేళ ఆడినా  సెకండాఫ్ (నెల రోజుల తర్వాత) లో వస్తాడేమో గానీ ఇప్పటికిప్పుడు  టీమ్ తో కలిసే పరిస్థితులైతే కనిపించడం లేదు.  ఈ నేపథ్యంలో  కేకేఆర్ కు ఇప్పటికిప్పుడు కెప్టెన్ అవసరం వచ్చిపడింది.   

కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ లో అయ్యర్ కాకుంటే కెప్టెన్సీ రేసులో ముందున్న పేర్లు  బంగ్లా  టీ20 కెప్టెన్ షకిబ్ అల్ హసన్, భారత బ్యాటర్ నితీశ్ రాణా, వెస్టిండీస్ ఆల్ రౌండర్లు  ఆండ్రూ రసెల్, సునీల్  నరైన్. ఈ ముగ్గురు  కేకేఆర్  కు చాలాకాలంగా  ఆడుతున్నారు. వీరిలో ఎవరో ఒకరు  సారథిగా ఎంపిక కావచ్చని  కేకేఆర్ వర్గాలు చెబుతున్నాయి. 

అయితే  షకిబ్ బంగ్లాదేశ్ జాతీయ జట్టు తరఫున  ఐర్లాండ్ తో   సిరీస్ ఆడుతున్నాడు.  అతడు  కేకేఆర్ ఆడే తొలి రెండు మ్యాచ్ లు ఆడేది అనుమానమే. రాణాకు  గతంలో సారథిగా చేసిన అనుభవం లేదు.  రసెల్   పోటీలో  ఉన్నా అతడి కంటే  నరైన్ వైపు కేకేఆర్ యాజమాన్యం, ఆ జట్టు ఓనర్ ఇటీవలే బాలీవుడ్ లో ‘పఠాన్’ సినిమాతో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తున్న  షారుఖ్ ఖాన్ మొగ్గుచూపుతున్నారని సమాచారం.    నరైన్.. కేకేఆర్ తో గడిచిన 11 సీజన్లుగా ఉన్నాడు.   ఒక జట్టు తరఫున ఇన్ని  సీజన్లు ఆడిన  క్రికెటర్లలో నరైన్ ప్రథమస్థానంలో ఉంటాడు.   కేకేఆర్ తరఫున ఆడుతూ   148 మ్యాచ్ లలో  152 వికెట్లు పడగొట్టాడు.  

అదీగాక ఇటీవలే  యూఏఈ వేదికగా జరగిన ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్ టీ20)లో  కోల్కతా  ఫ్రాంచైజీ పెట్టుబడులు పెట్టిన అబుదాబి నైట్ రైడర్స్  కు సునీల్ నరైన్ సారథిగా వ్యవహరించాడు. ఈ లీగ్ లో  అబుదాబి టీమ్ పది మ్యాచ్ లు ఆడి ఒకదాంట్లోనే గెలిచింది. అయినా  నరైన్ కే కేకేఆర్ పగ్గాలు అప్పజెప్పేందుకు  టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

ఐపీఎల్ సెకండాఫ్ లో  శ్రేయాస్ తిరిగి జట్టుతో చేరతాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో  నరైన్ ను తాత్కాలిక సారథిగా నియమించేందుకు  కేకేఆర్ రంగం సిద్ధం చేసిందని, ఇందుకు సంబంధించిన అధికారిక  ప్రకటన త్వరలోనే వెలువడనుందని  కేకేఆర్ వర్గాలు తెలిపాయి.   

మరో ఆటగాడికి గాయం..  

కెప్టెన్ లేమితో కొట్టుమిట్టాడుతున్న  కేకేఆర్ కు గాయాలు వేధిస్తున్నాయి.  ఇదివరకే శ్రేయాస్ అయ్యర్ సీజన్ లో  ఆడేది అనుమానంగా ఉంటే  కివీస్ పేసర్ లాకీ ఫెర్గూసన్ కూడా గాయం కారణంగా  ఆ జట్టు ఆడే కొన్ని  మ్యాచ్ లకు అందుబాటులో ఉండటం లేదు.   తాజాగా  కేకేఆర్ బ్యాటర్ నితీశ్ రాణా కూడా గాయపడ్డట్టు తెలుస్తున్నది. ఈడెన్ గార్డెన్   లో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్న  రాణా..  గాయంతో   ప్రాక్టీస్ నుంచి తప్పుకున్నట్టు  సమాచారం.  అయితే ఇదంతా ఆందోళన చెందాల్సిన  గాయమైతే కాదని రాణా  చెప్పినట్టు నైట్ రైడర్స్ ఎక్స్‌ట్రా ట్వీట్ చేసింది.  

 

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !