మీ తొక్కలో టీమ్‌లు ఆడితే చూడటానికి జనమే రారు.. రాజస్తాన్ అదిరిపోయే రిప్లై..

Published : Apr 06, 2023, 04:59 PM IST
మీ తొక్కలో టీమ్‌లు ఆడితే చూడటానికి జనమే రారు.. రాజస్తాన్ అదిరిపోయే రిప్లై..

సారాంశం

IPL 2023: గువహతిలోని బర్సపర స్డేడియం  వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ - పంజాబ్ మ్యాచ్  స్థానిక క్రికెట్ అభిమానులను అలరించింది. కానీ ఈ మ్యాచ్ చూసేందుకు జనం రాలేదన్న ట్రోల్స్ పై ఆర్ఆర్ స్పందించింది. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 ఎడిషన్ లో భాగంగా బుధవారం  రాజస్తాన్ రాయల్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య  మ్యాచ్ జరిగింది.  చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో   పంజాబ్ ఐదు పరుగుల తేడాతో  విజయం సాధించింది. ఈ సీజన్ లో ఇప్పిటివరకు హై  స్కోరింగ్ గేమ్స్ లో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. గువహతిలోని బర్సపర స్డేడియం  వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో  స్థానిక క్రికెట్ అభిమానులను అలరించింది. అయితే రాజస్తాన్ - పంజాబ్ మ్యాచ్ చూసేందుకు  జనం రాలేదని  సోషల్ మీడియాలో  జరుగుతున్న చర్చకు రాజస్తాన్ ట్విటర్ ఖాతాలో అదిరిపోయే రిప్లై ఇచ్చింది.  

రాజస్తాన్ - పంజాబ్ మ్యాచ్ ముగిసిన తర్వాత    ట్విటర్ లో ఓ చూజర్  బర్సపరలో ఖాళీగా ఉన్న కుర్చీల ఫోటోలను హైలైట్ చేస్తూ  ఓ ట్వీట్ చేశాడు. ట్వీట్ లో ‘రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ వంటి టీమ్స్  లకు ఐపీఎల్ లో  పెద్దగా క్రేజ్ లేదు.   అందుకే  స్టార్ స్పోర్ట్స్  ప్రతిసారి   సీఎస్కే, ముంబై, ఆర్సీబీ మ్యాచ్ ల హైలైట్ లనే ప్రసారం చేస్తుంది.  ఇది చూశాక అదేం తప్పులేదని అనిపిస్తోంది’అని ట్వీట్ చేశాడు. 

కాగా ఈ ట్వీట్ కు రిప్లై ఇస్తూ   రాజస్తాన్ రాయల్స్ కిరాక్ రిప్లై ఇచ్చింది. ఇదే స్టేడియంలో  జనం నిండుగా ఉన్న  ఫోటోను  ట్వీట్ చేస్తూ.. ‘ఓకే’అని  ఘాటుగా సమాధానమిచ్చింది.   బర్సపర స్టేడియం సామర్థ్యం 40 వేలు.  కానీ ఈశాన్య భారతంలో   క్రికెట్ కు  ఇంకా దేశంలో మిగిలిన ప్రాంతాల్లో ఉన్నంత క్రేజ్ లేదు. అయినప్పటికీ  మ్యాచ్ ను వీక్షించేందుకు  జనం కూడా భారీగానే తరలివచ్చారు.  రాజస్తాన్ కు జైపూర్ లో   ఫ్యాన్ బేస్ ఉంది.  జైపూర్  లో సర్దార్ మాన్సింగ్ స్టేడియంలో  జరిగే  మ్యాచ్ లను  చూసేందుకు అక్కడి అభిమానులు ఎగబడతారు.   కానీ  రాజస్తాన్.. తమ తర్వాతి హోం మ్యాచ్ ను కూడా గువహతి వేదికగానే ఆడనుంది.  ఏప్రిల్ 8న రాజస్తాన్.. ఢిల్లీతో మ్యాచ్ ను ఇదే వేదికపై ఆడుతుంది. 

 

ఇదిలాఉండగా.. ఐపీఎల్ లో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్ అయిన  చెన్నై, ఆర్సీబీ, ముంబైలు ఆడిన   మ్యాచ్ లకు  కూడా  కుర్చీలు ఖాళీగానే ఉన్నట్టు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.   

రాజస్తాన్ బ్యాటర్ పై  లక్నో విమర్శలు : 

 

రాజస్తాన్ బ్యాటర్  దేవదత్ పడిక్కల్ పై    లక్నో సూపర్ జెయింట్స్ విమర్శలు గుప్పించింది.   ఓపెనింగ్ స్థానం నుంచి తప్పుకున్నాక పడిక్కల్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని   విమర్శించింది.   ‘పడిక్కల్ భాయ్  ఎప్పుడైతే ఓపెనింగ్ నుంచి దిగిపోయాడో   అప్పుడే అతడి పతనం కూడా స్టార్ట్ అయింది’అని  పంజాబ్ తో మ్యాచ్ జరుగుతున్న  క్రమంలో   ట్వీట్ చేసింది.   కానీ తర్వాత ఈ ట్వీట్ ను డిలీట్ చేసింది.

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026 : ఏ ఐపీఎల్ టీం నుండి ఎక్కువమంది సెలెక్ట్ అయ్యారో తెలుసా?
India : షెఫాలీ వర్మ విధ్వంసం.. శ్రీలంక బేజారు! రెండో టీ20 టీమిండియాదే