IPL 2023: ఇంకా పడిపోవడానికేం లేదు.. ఇకనైనా లేస్తారా..? రాజస్తాన్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిన సన్ రైజర్స్

Published : May 07, 2023, 07:03 PM ISTUpdated : May 07, 2023, 07:10 PM IST
IPL 2023: ఇంకా పడిపోవడానికేం లేదు.. ఇకనైనా లేస్తారా..? రాజస్తాన్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిన సన్ రైజర్స్

సారాంశం

IPL 2023, RR vs SRH: ఐపీఎల్-16లో భారీ ఆశలతో   అడుగుపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్  దారుణ వైఫల్యాలతో  పాయింట్ల పట్టికలో పదో స్థానానికి పడిపోయింది.  నేడు హైదరాబాద్.. రాజస్తాన్ ను ఢీకొననుంది. 

వరుసగా చెత్త ప్రదర్శనలతో  పాయింట్ల పట్టికలో  పాతాళానికి పడిపోయిన  సన్ రైజర్స్ హైదరాబాద్ నేడు    ఐపీఎల్ లో  రాజస్తాన్ రాయల్స్ ను ఢీకొననుంది. జైపూర్ వేదికగా  జరిగే  మ్యాచ్ లో సన్ రైజర్స్ టాస్ ఓడి ఫస్ట్ బౌలింగ్‌కు రానుంది. రాజస్తాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. బౌలింగ్ లో ఫర్వాలేదనిపిస్తున్నా  బ్యాటింగ్ వైఫల్యాలతో  సతమతమవుతున్న  హైదరాబాద్ ఈ మ్యాచ్ లో అయినా పుంజుకుంటుందో లేదో చూడాలి. 

ఈ సీజన్లో  రాజస్తాన్ తో జరిగిన  మ్యాచ్ లో  అవమానకరమైన ఓటమి పాలైన విషయం తెలిసిందే. మరి నేటి మ్యాచ్ లో ఆ ఓటమికి బదులు తీర్చుకుంటారా..? లేక మళ్లీ రాజస్తాన్ బ్యాటర్లకు గులాం అవుతారా..? అన్నది తేలాల్సి ఉంది.  

ఐపీఎల్-16లో ఆడిన 9 మ్యాచ్ లలో  మూడు మాత్రమే గెలిచిన  సన్ రైజర్స్ నిన్నటివరకూ  9వ స్థానంలో ఉండేది.   కానీ ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీని ఓడించడంతో  ఆ జట్టు  8 పాయింట్లతో 9వ స్థానానికి ఎగబాకింది.   వరుసగా ఐదు ఓటముల తర్వాత  విజయాల బాట పట్టిన ఢిల్లీ ఇచ్చిన స్ఫూర్తిని  సన్ రైజర్స్ పునికి పుచ్చుకుంటే   అట్టడుగు  స్థానం ముద్రను చెరిపేసుకోవచ్చు.  ఇప్పటికిప్పుడు  సన్ రైజర్స్  ఆడే ఆరు మ్యాచ్ లలో గెలిచినా ప్లేఆఫ్స్ కు చేరడం కష్టమే అయినా కాస్త  పరువు నిలుపుకునే విధంగా అయినా   చేసుకుంటే చాలని  ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. 

అయితే అభిమానులు కోరుకుంటున్నా ఇదేం అంత ఈజీ కాదు. సన్ రైజర్స్ బ్యాటింగ్ దారుణంగా ఉంది. పేరుకు  స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయినా  అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, మార్క్‌రమ్ లు దారుణంగా విఫలమవుతున్నారు. ఇక హ్యారీ బ్రూక్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే  అంత మంచిది. ఉన్నంతలో క్లాసెన్ కాస్త ఫర్వాలేదనిపిస్తున్నాడు. 

మరోవైపు రాజస్తాన్  కూడా ఓటమి బాధల్లోనే ఉంది.  ఈ సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకుపోయిన ఆ జట్టు  తర్వాత ఓటముల బాటపట్టింది.  జోస్ బట్లర్, శాంసన్, పడిక్కల్ లు అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. రాజస్తాన్ లో ఈ సీజన్ లో ఆడిన మూడు మ్యాచ్ లలో రెండు ఓడింది. గత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో  దారుణ ఓటమి నుంచి  బయటపడేందుకు ఆ జట్టు ప్రణాళికలు రచిస్తోంది. వీక్ గా ఉన్న సన్ రైజర్స్ పై  గెలిచి పాయింట్ల పట్టికలో మళ్లీ ముందడుగు వేయాలని  భావిస్తున్నది. 

తుది జట్లు : 

సన్ రైజర్స్ హైదరాబాద్ :  అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్ ,  మార్కో జాన్సెన్, వివ్రంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి. నటరాజన్

రాజస్తాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్,    జో  రూట్, సంజూ శాంసన్ (కెప్టెన్), షిమ్రన్ హిట్‌మెయర్, ధ్రువ్ జురెల్, మురుగన్ అశ్విన్, ఆర్. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ ,  కుల్దీప్ యాదవ్, సందీప్ శర్మ 

 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !