IPL 2023: గుజరాత్ బౌలింగ్‌కు రాజస్తాన్ బ్యాటర్ల గులాం.. పాండ్యా సేన ముందు ఈజీ టార్గెట్

Published : May 05, 2023, 09:16 PM ISTUpdated : May 05, 2023, 09:17 PM IST
IPL 2023: గుజరాత్ బౌలింగ్‌కు రాజస్తాన్ బ్యాటర్ల గులాం..  పాండ్యా సేన ముందు ఈజీ టార్గెట్

సారాంశం

IPL 2023, RR vs GT:  స్లో టర్నర్ అయిన జైపూర్ పిచ్ పై మరో లోస్కోరింగ్ థ్రిల్లర్ రాబోతుంది. గుజరాత్ బౌలర్ల ధాటికి రాజస్తాన్..  118  పరుగులకే పరిమితమైంది.  ఇక రాజస్తాన్ ఆశలన్నీ ఆ జట్టు స్పిన్నర్ల మీదే.. 

ఐపీఎల్-16లో హోంగ్రౌండ్  రాజస్తాన్ కు అచ్చిరావడం లేదు.  ఇదే వేదికపై గత నెలలో  లక్నో చేతిలో లోస్కోరింగ్ థ్రిల్లర్ లో ఓడిన  రాజస్తాన్ తాజాగా గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ కూడా బెంబేలెత్తింది.  అహ్మదాబాద్ లో తమను దెబ్బకొట్టిన  రాజస్తాన్ పై బదులు తీర్చుకునేందుకు గుజరాత్ బౌలర్లు  రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.  బంతి టర్న్ అవుతున్న పిచ్ పై  రాజస్తాన్ ను  17.5 ఓవర్లలో 118 పరుగులకే పరిమితం చేశారు. మరి గుజరాత్ స్పిన్నర్లు రాణించిన ఈ పిచ్ పై  రాజస్తాన్  స్పిన్ త్రయం  అశ్విన్, చాహల్, జంపాలు ఏ మేరకు  రాణిస్తారో చూడాలి. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న  సంజూ శాంసన్‌‌కు తాను తీసుకున్న నిర్ణయం  తననే విస్మయానికి గురి చేయడానికి ఎంతో సమయం పట్టలేదు.  పవర్ ప్లేలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది.   హార్ధిక్ పాండ్యా వేసిన  రెండో  ఓవర్లో  బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదిన  జోస్ బట్లర్ (8)  నాలుగో బంతికి  మోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. 

ఈ సీజన్ లో  నిలకడగా ఆడుతున్న  రాజస్తాన్ ఓపెనర్ యశస్వి  జైస్వాల్.. 11 బంతులలో 14 పరుగులు చేసి   రనౌట్ అయ్యాడు. రషీద్ ఖాన్ వేసిన  ఆరో ఓవర్లో శాంసన్.. షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా ఆడాడు. పరుగు తీయడానికి యత్నించిన  శాంసన్ ముందుకెళ్లినా తర్వాత ఆగిపోయాడు. కానీ అప్పటికే   జైస్వాల్ క్రీజును వదలడంతో  రనౌట్‌గా వెనుదిరిగాడు. 

రెండు వికెట్లు పోయినా ఆరు ఓవర్లలో  50 పరుగులు చేసిన రాజస్తాన్‌కు ఆ తర్వాత కష్టాలు మరింత పెరిగాయి.  20 బంతుల్లో  3 ఫోర్లు,  ఒక సిక్సర్ సాయంతో  30 పరుగులు చేసిన  శాంసన్..  జోషువా లిటిల్ వేసిన  ఐదో బంతి  బ్యాట్ ఎడ్జ్ కు తాకి అక్కడే గాల్లోకి లేవడంతో అది నేరుగా  హార్ధిక్ చేతుల్లో పడింది.  

 

రషీద్ ఖాన్ వేసిన  8వ ఓవర్లో అశ్విన్ (2) క్లీన్ బౌల్డ్ కాగా.. జైస్వాల్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రియాన్ పరాగ్  (4) కూడా  రషీద్ ఖాన్ వేసిన పదో ఓవర్లోనే  రెండో బంతికి ఎల్బీగా నిష్క్రమించాడు.  ఆరు ఓవర్లలో యాభై  పరుగులు చేసిన రాజస్తాన్ పది ఓవర్లకు 72 పరుగులే చేసింది. 

వరుసగా వికెట్లు కోల్పోవడంతో  ఆదుకుంటాడని రాజస్తాన్ ఫ్యాన్స్ ఆశించిన  దేవదత్ పడిక్కల్  (12)  కూడా నూర్ అహ్మద్ వేసిన  12వ ఓవర్లో  మూడో బంతికి   బౌల్డ్ అయ్యాడు. అతడే వేసిన 14వ ఓవర్లో   ఫస్ట్ బాల్ కు ధ్రువ్ జురెల్  (9)  కూడా ఎల్బీ గా వెనుదిరిగాడు.  షిమ్రన్ హెట్‌మెయర్  (7) ను రషీద్ ఖాన్ 15వ ఓవర్లో ఫస్ట్ బాల్ కు వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.  రాజస్తాన్ స్కోరు  15 ఓవర్లకు వంద పరుగులకు చేరుకుంది.  చివర్లో  బౌల్ట్  (15) ఓ సిక్సర్ బాదాడు.  కానీ బౌల్ట్ ను షమీ ను ఔట్ చేయగా జంపా రనౌట్ అవడంతో  రాజస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. 

గుజరాత్ బౌలర్లలో  రషీద్ ఖాన్ 3, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీయగా  షమీ, హార్ధిక్, జోషువా లిటిల్ లు తలా ఓ వికెట్ తీశారు. 

PREV
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన