ఆడకుండానే ఫస్ట్ వికెట్ డౌన్.. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో భారత్‌కు భారీ షాక్..

Published : May 05, 2023, 05:40 PM IST
ఆడకుండానే ఫస్ట్ వికెట్ డౌన్..  డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో భారత్‌కు భారీ షాక్..

సారాంశం

IPL 2023:  వచ్చే నెల  ఆస్ట్రేలియాతో జరుగబోయే  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో మ్యాచ్ ఆడకముందే  టీమిండియాకు  భారీ షాక్ తాకింది. 

జూన్  7 నుంచి  11 వరకు ఇంగ్లాండ్ లోని ది ఓవల్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య  జరుగబోయే  ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో ఆడకుండానే భారత్ కు భారీ షాక్ తాకింది. నాలుగు రోజుల క్రితం  ఐపీఎల్ -16లో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ ఆడుతూ తీవ్రంగా గాయపడ్డ  కెఎల్ రాహుల్.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు అందుబాటులో ఉండనని తేల్చేశాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రాహుల్ తాను శస్త్రచికిత్స  చేయించుకోనున్నట్టు చెప్పాడు. 

ఐపీఎల్ - 2023 నుంచి రాహుల్  తప్పుకున్నట్టేనని   గత రెండ్రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అతడు  డబ్ల్యూటీసీ ఫైనల్స్ వరకైనా అందుబాటులోకి వస్తాడని అంతా భావించారు. కానీ ఇప్పుడు తాజాగా రాహుల్.. ఐపీఎల్ తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్స్ నుంచి కూడా తప్పుకుంటున్నట్టు  చెప్పకనే చెప్పాడు.  

తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రాహుల్, బెంగళూరుతో మ్యాచ్ లో తాను గాయపడ్డ ఫోటోను షేర్ చేస్తూ.. ‘వైద్యుల సూచన మేరకు   నేను త్వరలోనే  తొడ గాయానికి శస్త్రచికిత్స చేసుకోబోతున్నాను. ఆపరేషన్ తర్వాత నా  దృష్టంతా   త్వరగా కోలుకోవడం మీదే. ఇది చాలా కఠినంగానే ఉన్నా  త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుంటానని ఆశిస్తున్నా.  ఒక టీమ్ కు కెప్టెన్ గా  టోర్నీ మధ్యలో  తప్పుకోవడం కష్టంగానే ఉంది.  కానీ మా ఆటగాళ్లు  తమ బెస్ట్  ఆటను ఆడి మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నా. నేను  అందుబాటులో లేకున్నా  లక్నో ఆడే  ప్రతి మ్యాచ్ చూస్తా.. 

 

ఐపీఎల్ తో పాటు  వచ్చే నెలలో ఇంగ్లాండ్ లో జరిగే  డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు కూడా నేను అందుబాటులో ఉండను.  నేను త్వరలోనే మళ్లీ  మెన్ ఇన్ బ్లూతో కలుస్తా. దేశమే నా తొలి ప్రియారిటీ...’ అని రాసుకొచ్చాడు.  తనకు మద్దతుగా నిలిచినందుకు గాను  పేరుపేరునా అందరికీ కృతజ్ఞతలు  తెలిపాడు.  

గాయాల కారణంగా  ఇప్పటికే టీమిండియాకు డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో భారీ షాకులు తాకాయి.   జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ లు  దూరమయ్యారు.  ఇప్పుడు  రాహుల్ కూడా  తప్పుకోవడం భారత జట్టు విజయావకాశాలపై తీవ్రంగా ప్రభావం చూపేదే.  అయితే రాహుల్ గాయంతో తప్పుకోగా అదే జట్టుకు చెందిన పేసర్ జయదేవ్ ఉనద్కత్ అయినా   డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు అందుబాటులోకి వస్తాడా..? రాడా.. అన్నదానిపై ఇంకా స్పష్టత  లేదు. కాగా రాహుల్ వెళ్తే లక్నోకు  కెప్టెన్ ఎవరన్నది కూడా ఇంకా ప్రకటించలేదు.  చెన్నైతో ఇటీవలే ముగిసిన  మ్యాచ్ లో లక్నోను కృనాల్ పాండ్యా నడిపించాడు. మళ్లీ అతడికే కెప్టెన్సీ పగ్గాలు ఇస్తారా..? అన్నది తేలాల్సి ఉంది. 

 

PREV
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన