IPL 2023 RCB vs RR: టాస్ గెలిచిన ఆర్‌సీబీ... గెలిస్తేనే ప్లేఆఫ్స్ ఛాన్స్, లేదంటే అస్సామే...

Published : May 14, 2023, 03:04 PM ISTUpdated : May 14, 2023, 03:13 PM IST
IPL 2023 RCB vs RR: టాస్ గెలిచిన ఆర్‌సీబీ... గెలిస్తేనే ప్లేఆఫ్స్ ఛాన్స్, లేదంటే అస్సామే...

సారాంశం

IPL 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డు ప్లిసిస్... ట్రెంట్ బౌల్ట్ ప్లేస్‌లో ఆడమ్ జంపాని దింపిన రాయల్స్..  

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు జైపూర్‌లోని సవాయ్ మన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడుతోంది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డు ప్లిసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.   

ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ రెండు జట్లకీ ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. 12 మ్యాచుల్లో 6 విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌లో గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ మెరుగైన రన్ రేట్ కారణంగా టాప్ 3లోకి ఎంట్రీ ఇస్తుంది..

మరోవైపు 11 మ్యాచుల్లో ఐదు విజయాలు అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నేటి మ్యాచ్‌లో ఓడితే ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్టు అవుతుంది..

నేటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే పంజాబ్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలు కూడా మెరుగవుతాయి. అయితే రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ ఛాన్సులు క్లిష్టంగా మారతాయి..

ఇరు జట్ల మధ్య ఈ సీజన్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 పరుగుల తేడాతో గెలిచింది. 190 పరుగుల లక్ష్యఛేదనతో బరిలో దిగి, 182 పరుగులకి పరిమితమైంది రాజస్థాన్ రాయల్స్...

కీలక సమయంలో సిమ్రాన్ హెట్మయర్ రనౌట్ కావడం రాయల్స్‌ని దెబ్బ తీసింది. వరుసగా రెండు మ్యాచుల్లో భారీ లక్ష్యాలను కాపాడుకోలేక ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... నేటి మ్యాచ్‌లో బ్యాటర్లనే నమ్ముకుంది..

మొదటి 5 మ్యాచుల్లో నాలుగింట్లో గెలిచి టేబుల్ టాపర్‌గా ఉన్న రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత 7 మ్యాచుల్లో రెండే విజయాలు అందుకుంది. అయితే హ్యాట్రిక్ ఓటముల తర్వాత కేకేఆర్‌పై 9 వికెట్ల తేడాతో గెలిచిన రాజస్థాన్ రాయల్స్, ఈ జోరును కొనసాగించాలని అనుకుంటోంది..

ట్రెంట్ బౌల్ట్ గాయంతో బాధపడుతూ ఉండడంతో అతని స్థానంలో ఆడమ్ జంపాని తుదిజట్టులోకి తీసుకొచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంచలన ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్‌తో పాటు సంజూ శాంసన్‌, జోస్ బట్లర్... రాజస్థాన్ రాయల్స్‌కి ప్రధాన బలంగా మారారు. సిమ్రాన్ హెట్మయర్ ఒకటి రెండు మ్యాచుల్లో మెరుపులు మెరిపించినా, దాన్ని కొనసాగించలేకపోయాడు. గత రెండు మ్యాచుల్లో జో రూట్‌కి బ్యాటింగ్ అవకాశం రాలేదు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా రెండు మార్పులతో బరిలో దిగుతోంది. జోష్ హజల్‌వుడ్‌తో పాటు భారీగా పరుగులు ఇస్తున్న వానిందు హసరంగకు తుది జట్టులో చోటు దక్కలేదు.

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇది: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), జో రూట్, దృవ్ జురెల్, సిమ్రాన్ హెట్మయర్, రవిచంద్రన్ అశ్విన్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, కెఎం అసిఫ్, యజ్వేంద్ర చాహాల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇది: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, మైకేల్ బ్రాస్‌వెల్, వేర్న్ పార్నెల్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ 

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?