తీరు మారని ఢిల్లీ.. ఈజీ విక్టరీతో పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం..

Published : May 13, 2023, 11:11 PM ISTUpdated : May 13, 2023, 11:15 PM IST
తీరు మారని ఢిల్లీ.. ఈజీ విక్టరీతో పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం..

సారాంశం

IPL 2023, DC vs PBKS: ఐపీఎల్ - 16 ప్లేఆఫ్స్ రేసులో  తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో  పంజాబ్ బ్యాటర్లు విఫలమైనా బౌలర్లు రాణించి ఆ జట్టుకు  సూపర్ డూపర్  విజయాన్ని అందించారు. 

అదే నిర్లక్ష్యం. అదే  చెత్త ఆట.  ప్లేఆఫ్స్  రేసు నుంచి తప్పుకున్న  ఢిల్లీ క్యాపిటల్స్   గెలిచినా ఓడినా పెద్దగా ఫలితం లేని మ్యాచ్ లలో   కూడా అదే చెత్త ఆటతో  విసుగు తెప్పిస్తున్నది.   పంజాబ్ ను  ఢిల్లీ బౌలర్లు 167 పరుగులకే కట్టడి చేస్తే  మరోసారి ఢిల్లీ బ్యాటర్లు తమ చెత్త ఆటతో   మ్యాచ్ ను చేజేతులా పోగొట్టుకున్నారు.  కెప్డెన్ డేవిడ్ వార్నర్  (27 బంతుల్లో 54,  10 బౌండరీలు, 1 సిక్స్)కి తోడు ఫిల్ సాల్ట్  (21) మంచి ఆరంభాన్ని ఇచ్చినా  ఆ తర్వాత వచ్చినోళ్లు వచ్చినట్టుగానే  పెవిలియన్ చేరి   దారుణ ఓటమి మూటగట్టుకున్నారు.  పంజాబ్ నిర్దేశించిన  168 టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఢిల్లీ.. 20 ఓవర్లలో  8 వికెట్లు కోల్పోయి 136  పరుగులకే పరిమితమైంది. ఫలితంగా పంజాబ్ 31 పరుగుల తేడాతో గెలుపొందింది. 

పంజాబ్ బౌలర్లలో  స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రర్ నాలుగు వికెట్లతో ఢిల్లీ వెన్ను విరవగా రాహుల్ చాహర్ కూడా రెండు వికెట్లు తీసి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ గెలుపుతో పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవడమే గాక పాయింట్ల పట్టికలో  ఆరో స్థానానికి చేరింది.  ఈ సీజన్ లో ఆ జట్టు మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. 

స్వల్ప లక్ష్య ఛేదనలో కూడా ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ మరోసారి తడబడింది.   ఓపెనర్లు  డేవిడ్ వార్నర్, ఫిల్ సాల్ట్ లు రాణించారు. ఈ ఇద్దరూ ఫస్ట్ వికెట్ కు   6.2 ఓవర్లలోనే   69 పరుగులు జోడించారు. రిషి ధావన్ వేసిన  ఫస్ట్ ఓవర్ లోనే  వార్నర్ రెండు ఫోర్లు కొట్టాడు. హర్‌ప్రీత్ బ్రర్ వేసిన  3వ ఓవర్లో  ఫిలిప్ సాల్ట్ కూడా  రెండు బౌండరీలు సాధించాడు. ఆ తర్వాత సామ్ కరన్, నాథన్ ఎల్లీస్ ల బౌలింగ్ లలో కూడా వార్నర్ రెండేసి బౌండరీలు బాదాడు. పవర్ ప్లే ముగిసేసరికి   ఢిల్లీ స్కోరు  వికెట్ నష్టపోకుండా  65 పరుగులు.  

ఢిల్లీ భ్రమలు తొలగించిన బ్రర్.. 

పవర్ ప్లే ముగిసేటప్పటికే  ఢిల్లీ స్కోరు 65 ఉండటంతో  ఆ జట్టు విజయం ఖాయమే అనుకున్నారంతా. కానీ అక్కడే ట్విస్ట్. పంజాబ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రర్ వరుస ఓవర్లలో ఢిల్లీకి వరుస షాకులిచ్చాడు.  ఈ క్రమంలో ఫస్ట్ బాధితుడు  సాల్ట్. ఏడో ఓవర్ రెండో బాల్ కు సాల్ట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  రాహుల్ చాహర్ వేసిన   8వ ఓవర్లో ఫస్ట్ బాల్ కు సింగిల్ తీసి  23 బంతుల్లోనే అర్థ  సెంచరీ చేసుకున్నాడు వార్నర్. కానీ అదే ఓవర్లో మూడో బాల్ కు మిచెల్ మార్ష్ ఎల్బీగా వెనుదిరిగాడు. 

హర్‌ప్రీత్   9వ ఓవర్లో  ఫస్ట్ బాల్ కు రిలీ రూసో (5), ఆఖరి బంతికి  డేవిడ్ వార్నర్ ను ఔట్ చేశాడు. రాహుల్ చాహర్ పదో ఓవర్లో ఫస్ట్ బాల్ కు  అక్షర్ పటేల్ ను ఎల్బీగా ఔట్ చేసి ఢిల్లీని కోలుకోనీయకుండా చేశాడు.  11వ ఓవర్ ఫస్ట్ బాల్ కే మనీష్ పాండే  (0) బ్రర్ బౌలింగ్ లో  బౌల్డ్ అయ్యాడు. 6 ఓవర్లకు 65-0గా ఉన్న ఢిల్లీ  11 ఓవర్లకు వచ్చే ముగిసేసరికి  91-6కి చేరింది.  

ఇక కొంతసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్న  అమన్ ఖాన్ (16)  ను నాథన్ ఎల్లీస్  16వ  ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. చివర్లో   కుల్దీప్  (10 నాటౌట్), ముకేశ్ కుమార్ (5 నాటౌట్) లు  ఢిల్లీ ఆలౌట్ కాకుండా అడ్డుకున్నారు. 

ప్రభ్‌సిమ్రన్ సెంచరీ.. 

ఈ మ్యాచ్ లో పంజాబ్ ఇన్నింగ్స్ మొదట్లో తడబడింది.45 పరుగులకే  మూడు కీలక వికెట్లు కోల్పోయిన  దశలో  ప్రభ్‌సిమ్రన్   జట్టును ఆదుకున్నాడు. 61 బంతుల్లో సెంచరీ  పూర్తి చేసుకున్నాడు.   ఐపీఎల్ లో అతడికి ఇదే ఫస్ట్ సెంచరీ కావడం గమనార్హం. సెంచరీ చేసే క్రమంలో  మొదటి 31 బంతుల్లో  27 పరుగులు చేసిన అతడు.. తర్వాత 34 బంతుల్లో  ఏకంగా 76 పరుగులు రాబట్టడం విశేషం.   ప్రభ్‌సిమ్రన్ సెంచరీతో  పంజాబ్.. నిర్ణీత  20 ఓవర్లలో  ఏడు వికెట్లు కోల్పోయి   167  పరుగులు చేసింది. 

PREV
click me!

Recommended Stories

IPL 2026 : 9 మంది ఆల్‌రౌండర్లతో ఆర్సీబీ సూపర్ స్ట్రాంగ్.. కానీ ఆ ఒక్కటే చిన్న భయం !
స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు