మళ్లీ గెలుపు బాట పట్టాలని..! లక్నోతో మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆర్సీబీ

Published : Apr 10, 2023, 07:03 PM ISTUpdated : Apr 10, 2023, 07:12 PM IST
మళ్లీ గెలుపు బాట పట్టాలని..! లక్నోతో మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆర్సీబీ

సారాంశం

IPL 2023: ఐపీఎల్  లో మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ సీజన్ లో   మూడో మ్యాచ్ ఆడుతున్నది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో లక్నోతో మ్యాచ్ లో తలపడుతున్నది.  

ఐపీఎల్-16 సీజన్ ను విజయంతో మొదలుపెట్టిన  ఆర్సీబీ..  ఇటీవలే  కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో మాత్రం ఓడింది. ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని ఆర్సీబీ.. నేడు స్వంత గ్రౌండ్ లో  లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది.  బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం  వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో  లక్నో సారథి కెఎల్ రాహుల్.. టాస్ ఓడి ఫస్ట్ ఫీల్డింగ్  చేసుందుకు మొగ్గు చూపాడు.  ఆర్సీబీ బ్యాటింగ్ చేయనుంది.

గత సీజన్ లో ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన  లక్నోతో ఆర్సీబీ ఈ లీగ్ లో ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు ఆడింది. అయితే ఈ రెండు మ్యాచ్ లలోనూ బెంగళూరుదే పైచేయిగా ఉంది.   మరి ఈ సీజన్ లో విజయం ఎవరిని వరించేనో..? 

ఐపీఎల్ - 2023 ఎడిషన్ లో భాగంగా  చిన్నస్వామి స్టేడియంలో  ముంబై ఇండియన్స్ ను ఓడించిన ఆర్సీబీ.. తర్వాత కేకేఆర్ తో మాత్రం డీలా పడింది.    బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ, డుప్లెసిస్  మీద భాగా ఆధారపడుతున్న ఆ జట్టు   కేకేఆర్ తో ఓటమిని కొనితెచ్చుకుంది. మిడిలార్డర్ లో ఉన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, అనూజ్ రావత్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్ లు  రాణించాల్సి ఉంది.  

బౌలింగ్ లో కూడా  ఆర్సీబీ  పేస్ బలం ఏమంత గొప్పగా లేదు. ఉన్న ఒక్క అంతర్జాతీయ అనుభవమున్న విదేశీ పేసర్ రీస్ టాప్లీ కూడా గాయంతో  టోర్నీకి దూరమయ్యాడు.  మరి నేటి మ్యాచ్ లో సిరాజ్ కు తోడుగా  ఉన్న బౌలింగ్ దళం లక్నోను ఎలా కట్టడి చేస్తుందో చూడాలి.  

ఇక లక్నో  జట్టు కూడా పటిష్టంగానే ఉంది.   బ్యాటింగ్ లో కెఎల్ రాహుల్ , కైల్ మేయర్స్,  దీపక్ హుడా, క్వింటన్ డికాక్ ,  నికోలస్ పూరన్ లతో  ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ సాలిడ్ గా ఉంది. చెన్నైతో మ్యాచ్  లో 200 ప్లస్ టార్గెట్ ను  కూడా దాదాపు గా చేధించినంత  పని చేసింది ఆ  జట్టు. ఆల్ రౌండర్లు  కృనాల్ పాండ్యా, మార్కస్  స్టోయినిస్  లతో పాటు  మార్క్ వుడ్  బౌలింగ్ ఆ జట్టుకు అదనపు బలం.   స్పిన్నర్ రవి బిష్ణోయ్  కూడా  జోరుమీదే ఉన్నాడు.  లక్నో బౌలింగ్ దళాన్ని  ఆర్సీబీ ఎలా ఎదుర్కుంటుందన్నది ఆసక్తికరం. 

 

తుది జట్లు :  ఈ  మ్యాచ్ కోసం ఇరు జట్లలోనూ మార్పులు జరిగాయి. ఆ వివరాలివే..


ఆర్సీబీ :  ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ,  మహిపాల్ లోమ్రర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, అనూజ్ రావత్,  హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్,  మహ్మద్ సిరాజ్

లక్నో :  కెఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా,  మార్కస్ స్టోయినిస్,  కృనాల్ పాండ్యా,  నికోలస్ పూరన్, జయదేవ్ ఉనద్కత్, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్ 

 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?