ఫ్యాబులస్ ఫ్యాబ్, విరాట్ వీరత్వం... భారీ టార్గెట్‌ని ఊదేసిన ఆర్‌సీబీ! ముంబైకి తప్పని ఓటమి...

Published : Apr 02, 2023, 11:05 PM IST
ఫ్యాబులస్ ఫ్యాబ్, విరాట్ వీరత్వం... భారీ టార్గెట్‌ని ఊదేసిన ఆర్‌సీబీ! ముంబైకి తప్పని ఓటమి...

సారాంశం

ముంబై ఇండియన్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్ హాఫ్ సెంచరీలు.. 

టాపార్డర్ ఫెయిల్ అయినా తిలక్ వర్మ వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా 172 పరుగుల భారీ స్కోరు చేసిన ముంబై ఇండియన్స్‌కి తొలి మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు. ఆర్‌సీబీ ఓపెనర్లు ఫాఫ్ డుప్లిసిస్, విరాట్ కోహ్లీ కలిసి ఆడుతూ పాడుతూ బౌండరీల మోత మోగించడంతో కొండంత టార్గెట్ చిన్నదైపోయింది...

విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో ఓపెనర్‌గా 3 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న విరాట్, ఐపీఎల్‌లో 50వ 50 ప్లస్ స్కోరు నమోదు చేశాడు. డేవిడ్ వార్నర్ ఒక్కడే 60 సార్లు 50+ స్కోర్లు చేసి, విరాట్ కంటే ముందున్నాడు..

నాలుగో ఓవర్ తొలి బంతికి విరాట్ కోహ్లీ ఇచ్చిన స్ట్రైయిక్ క్యాచ్‌ని జోఫ్రా ఆర్చర్ అందుకోలేకపోయాడు. ఆ తర్వాతి ఓవర్‌లో చాహాల్ బౌలింగ్‌లో ఫాఫ్ డుప్లిసిస్ అవుటైనా, అంపైర్ నాటౌట్‌ ఇవ్వడం, ముంబై ఇండియన్స్ డీఆర్‌ఎస్ తీసుకోకపోవడంతో లైఫ్ దక్కింది. ఇలా వచ్చిన అవకాశాలను చక్కగా వాడుకున్న ఇద్దరు ప్లేయర్లు, తొలి వికెట్‌కి 148 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. 

15వ ఓవర్‌లో అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ని హృతిక్ షోకీన్ అందుకోలేకపోయాడు. అయితే అదే ఓవర్‌లో ఫాఫ్ డుప్లిసిస్ వికెట్ కోల్పోయింది ఆర్‌సీబీ. 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 73 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

అయితే అప్పటికే 5 ఓవర్లలో 24 పరుగులు కావాల్సిన స్థితికి చేరుకుంది ఆర్‌సీబీ. దినేశ్ కార్తీక్ 3 బంతులు ఆడి, కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. మ్యాక్స్‌‌వెల్ వస్తూనే 2 సిక్సర్లు బాదడంతో 16వ ఓవర్‌లో 13 పరుగులు వచ్చేశాయి..

49 బంతుల్లో  6 ఫోర్లు,  5 సిక్సర్లతో 82 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, వరుసగా రెండు సిక్సర్లు బాది మ్యాచ్‌ని ముగించాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగుల భారీ స్కోరు చేసింది. టాపార్డర్‌ వైఫల్యంతో  48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ వీరోచిత హాఫ్ సెంచరీ కారణంగా ఈ మాత్రం స్కోరు చేయగలిగింది..

13 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో హర్షల్ పటేల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కామెరూన్ గ్రీన్ 4 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి రీస్ తోప్లే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

10 బంతుల్లో 1 పరుగు చేసిన రోహిత్ శర్మ, ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 29 పరుగులు మాత్రమే చేసింది ముంబై ఇండియన్స్..

16 బంతుల్లో ఓ ఫోర్‌తో 15 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, మైఖేల్ బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో షాబజ్ అహ్మద్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కర్ణ్ శర్మ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన నేహాల్ వదేరా 13 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. టిమ్ డేవిడ్ 7 బంతుల్లో 4 పరుగులు చేసి కర్ణ్ శర్మ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో దూకుడుగా బ్యాటింగ్ కొనసాగించిన తిలక్ వర్మ, 32 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 3 బంతుల్లో 5 పరుగులు చేసిన హృతీక్ షోకీన్, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ 46 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేయగా అర్షద్ ఖాన్ 9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేశాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే