ఇదేం పిచ్‌ రా బాబూ... ఆర్‌సీబీ బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్! లక్నో ముందు ఈజీ టార్గెట్...

Published : May 01, 2023, 09:45 PM ISTUpdated : May 01, 2023, 09:50 PM IST
ఇదేం పిచ్‌ రా బాబూ... ఆర్‌సీబీ బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్! లక్నో ముందు ఈజీ టార్గెట్...

సారాంశం

IPL 2023: 126 పరుగులకే పరిమితమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఫాఫ్ డుప్లిసిస్.. 

టెస్టు మ్యాచులకు మాత్రమే పనికి వచ్చే లక్నో పిచ్‌పై ఐపీఎల్ మ్యాచులు చూసే ఫ్యాన్స్‌కి, ఆడే టీమ్స్‌ సహనానికి పరీక్ష పెడుతున్నాయి. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులే చేయగలిగింది.

విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్ కలిసి తొలి వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 30 బంతుల్లో 3 ఫోర్లతో 31 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 11 బంతుల్లో 9 పరుగులు చేసిన అనుజ్ రావత్, కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు..

5 బంతుల్లో 4 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 7 బంతుల్లో 6 పరుగులు చేసిన సుయాశ్ ప్రభుదేశాయ్, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో కృష్ణప్ప గౌతమ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

ఈ సమయంలో మ్యాచ్‌కి అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి 15.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు మాత్రమే చేయగలిగింది. అరగంట తర్వాత తిరిగి ప్రారంభమైన ఆటను దినేశ్ కార్తీక్‌ బౌండరీతో ప్రారంభించాడు...

అమిత్ మిశ్రా బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్ సిక్సర్ బాదడంతో పిచ్ మారిపోయిందని అనుకున్నారంతా. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. 40 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 44 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో కృనాల్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

4 బంతుల్లో 3 పరుగులు చేసిన మహిపాల్ లోమ్రోర్, నవీన్ వుల్ హక్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 11 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసిన మురళీ కార్తీక్, యష్ ఠాకూర్ బౌలింగ్‌లో రనౌట్ అయ్యాడు..

కీలకమైన 18, 19వ ఓవర్లలో ఐదేసి పరుగులే చేశారు ఆర్‌సీబీ బ్యాటర్లు. ఆఖరి ఓవర్‌లో కర్ణ్ శర్మ, కృష్ణప్ప గౌతమ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా మహ్మద్ సిరాజ్, నికోలస్ పూరన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సిరాజ్ అవుట్ విషయంలో అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్న లక్నోకి అనుకూలంగా ఫలితం వచ్చింది.

ఆఖరి బంతికి ఫోర్ బాదిన హసరంగ మ్యాచ్‌ని బౌండరీతో ముగించాడు. కోహ్లీ ఫోర్‌తో మొదలైన ఆర్‌సీబీ ఇన్నింగ్స్, హసరంగ ఫోర్‌తో ముగిసింది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో నవీన్ వుల్ హక్‌కి 3 వికెట్లు దక్కగా రవి భిష్ణోయ్, అమిత్ మిశ్రా రెండేసి వికెట్లు తీశారు. కృష్ణప్ప గౌతమ్‌కి ఓ వికెట్ దక్కింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 135 పరుగుల టార్గెట్ కొట్టలేకపోయిన లక్నో, నేటి మ్యాచ్‌లో 127 పరుగులను ఛేదించగలదో లేదో తేలిపోనుంది.

నేటి మ్యాచ్‌లో గెలిస్తే లక్నో సూపర్ జెయింట్స్ మెరుగైన రన్‌రేట్ కారణంగా టేబుల్ టాప్ పొజిషన్‌లో చేరే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

తెలుగోడికి హ్యాండ్ ఇచ్చిన ఫ్రాంచైజీలు.. ఏంటి కావ్య పాప.! రూ. 75 లక్షలు కూడా లేవా..
INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం