గెలుపు గుర్రాల రెండో సవారి.. పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్..

Published : Apr 05, 2023, 07:03 PM ISTUpdated : Apr 05, 2023, 07:10 PM IST
గెలుపు గుర్రాల రెండో సవారి.. పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్..

సారాంశం

IPL 2023: ఐపీఎల్ -16లో తాము ఆడిన  తొలి మ్యాచ్ లలో  ఘన విజయాలు అందుకున్న రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ లు  నేడు ఈ సీజన్ లో తొలిసారి తలపడుతున్నాయి. 

బ్రహ్మపుత్ర తీరం మరోసారి క్రికెట్ హోరుతో పోటెత్తనుంది. మూడేండ్ల (2020లో చివరి మ్యాచ్) తర్వాత  ఐపీఎల్ కు  ఆతిథ్యమిస్తున్న అసోం లోని గువహతి స్టేడియంలో   నేడు రాజస్తాన్ రాయల్స్  -   పంజాబ్ కింగ్స్ లు  ఈ సీజన్ లో తొలిసారి తలపడుతున్నాయి.  గువహతిలోని  బర్సపర  స్టేడియం వేదికగా  జరుగుతున్న ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్  మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్  టీమ్ బ్యాటింగ్ కు రానుంది.  

బర్సపర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్  రాజస్తాన్ కు జైపూర్ తర్వాత  హోం గ్రౌండ్.  పిచ్ మీద కాస్త గ్రాస్ ఉండటంతో  స్వింగ్ బౌలర్లకు  ఉపయోగకరంగా ఉంటుంది.    బౌల్ట్  కాస్త స్వింగ్ రాబడితే  పంజాబ్ కు కష్టమే.  పిచ్ రాను రాను బ్యాటర్లకూ అనుకూలించే అవకాశాలుంటాయి.  

గత మ్యాచ్ లో  హైదరాబాద్ ను చిత్తుగా ఓడించిన రాజస్తాన్ రాయల్స్ అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నది.   ఆ జట్టు నిండా   మ్యాచ్ విన్నర్లకు కొదవ లేదు.  సన్ రైజర్స్ తో మ్యాచ్  లో  కళ్లు చెదిరే ఆరంభం ఇచ్చిన   జోస్ బట్లర్ - యశస్వి జైస్వాల్  లు మరోసారి అలాంటి   ప్రారంభాన్ని ఇవ్వాలని   రాజస్తాన్ కోరుకుంటున్నది.  వన్ డౌన్ లో సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్,  షిమ్రన్ హెట్మెయర్, రియాన్ పరాగ్ లతో  ఆ జట్టు బ్యాటింగ్  లైనప్ దుర్బేధ్యంగా ఉంది. 

బౌలింగ్ లో కూడా   ట్రెంట్ బౌల్ట్ నాయకత్వంలో పేస్ బాధ్యతలు పంచుకుంటున్న కెఎం ఆసిఫ్ సన్ రైజర్స్ తో మ్యాచ్ లో   ఆకట్టుకున్నాడు. నవ్‌దీపై సైనీ భారీగా పరుగులిచ్చుకున్నాడు. స్పిన్నర్లలో అశ్విన్, చహల్ రూపంలో  రాజస్తాన్ కు   ప్రపంచ  స్థాయి బౌలింగ్ యూనిట్ ఉంది. 

పంజాబ్  కూడా  బ్యాటింగ్  లో శిఖర్ ధావన్,  భానుక రాజపక్స వంటి అనుభవజ్ఞులతో పాటు   ఏ స్థానంలో వచ్చినా రెచ్చిపోయే ఆడే జితేశ్ శర్మ, సామ్ కరన్, సికిందర్ రజలతో  బ్యాటింగ్ లైనప్ బాగానే ఉంది.   కోల్కతా తో మ్యాచ్ లో ఆడింది తక్కువ బంతులే అయినా  ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్  ఆకట్టుకున్నాడు.  ఇక బౌలింగ్ లో అర్ష్‌దీప్ సింగ్, సామ్ కరన్,  నాథన్ ఎల్లీస్ లపైనే పంజాబ్ ఆశలు పెట్టుకుంది.  

కాగా  ఈ స్టేడియంలో  నేటి మ్యాచ్ తో పాటు  ఏప్రిల్ 8న మరో మ్యాచ్ జరుగనుంది.  

తుది జట్లు :  హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో  బరిలోకి దిగిన టీమ్ తోనే రాజస్తాన్  నేటి మ్యాచ్ లో ఆడనుంది. పంజాబ్ కూడా  కేకేఆర్ తో ఆడిన టీమ్ తోనే ఆడుతున్నది. 

పంజాబ్ కింగ్స్ : శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రన్ సింగ్, భానుక రాజపక్స, జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, సామ్ కరన్, నాథన్ ఎల్లీస్, హర్‌ప్రీత్ బ్రర్, రాహుల్ చహర్, అర్ష్‌దీప్ సింగ్ 

రాజస్తాన్ రాయల్స్ :  యశస్వి  జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్మెయర్, జేసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కెఎం అసిఫ్, యుజ్వేంద్ర చహల్ 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?