IPL 2023: పృథ్వీ షా, రిలే రసో హాఫ్ సెంచరీలు, వార్నర్ భాయ్ మెరుపులు... పంజాబ్ కింగ్స్ ముందు...

Published : May 17, 2023, 09:14 PM IST
IPL 2023: పృథ్వీ షా, రిలే రసో హాఫ్ సెంచరీలు, వార్నర్ భాయ్ మెరుపులు... పంజాబ్ కింగ్స్ ముందు...

సారాంశం

ఐపీఎల్ 2023 సీజన్‌లో తొలిసారి 200+  స్కోరు దాటిన ఢిల్లీ క్యాపిటల్స్... సీజన్‌లో పృథ్వీ షా తొలి హాఫ్ సెంచరీ, ఐపీఎల్‌లో మొదటి హాఫ్ సెంచరీ బాదిన రిలే రసో... 

ఐపీఎల్ 2023 సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు ఫామ్‌లోకి వచ్చారు. మొదటి 6 మ్యాచుల్లో కలిపి 47 పరుగులే చేసి అట్టర్ ఫ్లాప్ అయిన పృథ్వీ షాకి తిరిగి తుది జట్టులోకి తీసుకొచ్చింది ఢిల్లీ. పరువు కోసం ఆడుతున్న మ్యాచ్‌లో పృథ్వీ షా, తన పరువు కాపాడుకుంటూ హాఫ్ సెంచరీతో కమ్‌బ్యాక్ ఇచ్చాడు...

పృథ్వీ షాకి తోడు కెప్టెన్ డేవిడ్ వార్నర్, రిలే రసో మెరుపులు మెరిపించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. 

సామ్ కుర్రాన్ వేసిన తొలి ఓవర్‌లో 4, రబాడా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో 2 పరుగులే వచ్చాయి. అయితే మూడో ఓవర్‌ ఆఖరి 2 బంతుల్లో బౌండరీలు బాదిన డేవిడ్ వార్నర్, స్కోరు బోర్డులో కదలిక తీసుకొచ్చాడు. నాలుగో ఓవర్‌లో 4, 6, 6, ఐదో ఓవర్‌లో 4, 4, 6 రావడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 61 పరుగులు చేయగలిగింది ఢిల్లీ క్యాపిటల్స్..

39 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ని రాహుల్ చాహార్ జారవిడిచాడు. అయితే ఆ తర్వాతి ఓవర్‌లోనే వార్నర్ అవుట్ అయ్యాడు. 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

వస్తూనే రెండు బౌండరీలు బాదిన రిలే రసో, రబాడా వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో 6, 4, 6 బాది 17 పరుగులు రాబట్టాడు. 38 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 54 పరుగులు చేసిన పృథ్వీ షా, సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

25 బంతుల్లో ఐపీఎల్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్న రిలే రసో, ఫిలిప్ సాల్ట్‌తో కలిసి 30 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 82 పరుగులు చేసిన రిలే రసోతో పాటు 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసిన ఫిలిప్ సాల్ట్ బాదుడుకి ఢిల్లీ క్యాపిటల్స్‌ స్కోరు 200 మార్కు దాటేసింది..

PREV
click me!

Recommended Stories

Indian Cricket: టెస్టుల్లో 300, వన్డేల్లో 200, ఐపీఎల్‌లో 100.. ఎవరీ మొనగాడు?
IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?