
ఐపీఎల్ - 16 ప్లేఆఫ్స్ అవకాశాలు అడుగంటిన నేపథ్యంలో కాస్తో కూస్తో ఉన్న ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ - పంజాబ్ కింగ్స్ లు నేడు తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోగలదు. ఈ నేపథ్యంలో ఇరు జట్లకూ కీలకంగా మారిన ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్తాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఈ సీజన్ మధ్యలో ఒక దశలో టేబుల్ టాపర్స్ గా ఉన్న రాజస్తాన్ రాయల్స్.. ఆ తర్వాత వరుస పరాజయాలతో టాప్ - 5 నుంచి నిష్క్రమించడమే గాక ఇప్పుడు ప్లేఆఫ్స్ రేసులో కూడా దాదాపుగా తప్పుకున్నట్టే. ఈ సీజన్ లో రాజస్తాన్.. 13 మ్యాచ్ లు ఆడి ఆరు మాత్రమే గెలిచి ఏడింట ఓడి 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.
మరోవైపు పంజాబ్ కూడా 13 మ్యాచ్ లు ఆడి ఆరు గెలిచి ఏడు ఓడి 12 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు 14 పాయింట్లతో ముంబై ఇండియన్స్ ను అధిగమించి ఐదో స్థానానికి చేరే అవకాశం ఉంటుంది. అయితే ఐదో స్థానానికి చేరినా పంజాబ్ - రాజస్థాన్ లలో విజేత ప్లేఆఫ్స్ కు వెళ్లే అవకాశాలూ తక్కువే. ఈ రెండింటికీ ఇదే ఆఖరి మ్యాచ్. ముంబైకి మాత్రం మరో మ్యాచ్ మిగిలుంది. అదీగాక ఆర్సీబీ కూడా నాలుగో స్థానాని దూసుకురావడంతో ఆ జట్టు ఇప్పుడు ఆఖరి లీగ్ మ్యాచ్ లో గుజరాత్ చేతిలో ఓడిపోవాలి. ఆ క్రమంలో హైదరాబాద్ తో మ్యాచ్ లో గెలిస్తేనే ముంబైకి కూడా ప్లేఆఫ్స్ అవకాశాలుంటాయి.
తుది జట్లు :
రాజస్తాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రన్ హెట్‌మెయర్, రియాన్ పరాగ్, ఆడమ్ జంపా, ట్రెంట్ బౌల్ట్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
పంజాబ్ కింగ్స్ : శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రన్ సింగ్, అథర్వ థైడే, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరన్, జితేశ్ శర్మ, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రర్, రాహుల్ చాహర్, కగిసొ రబాడా, అర్ష్‌దీప్ సింగ్