ధోనీ అడిగినా చేతులు కలపని తమిళ కుట్టీ... నటరాజన్ కూతురితో మాహీ క్యూట్ ముచ్ఛట్లు...

By Chinthakindhi RamuFirst Published Apr 22, 2023, 4:23 PM IST
Highlights

సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన  సన్‌రైజర్స్ హైదరాబాద్... స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన నటరాజన్ కూతురు హన్విక... 

పేరుకి చెన్నై సూపర్ కింగ్స్ అయినా సీఎస్‌కేలో తమిళ్ ప్లేయర్లు ఒక్కరూ లేరు. అలాగే నామ్‌ కే వాస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ అని పెట్టుకున్నా ఆరెంజ్ ఆర్మీ, టీమ్ యజమానులు తమిళనాడు రాష్ట్రానికి చెందిన సన్‌ నెట్‌వర్క్‌. అలాగే ఎస్‌ఆర్‌హెచ్‌కి ఆడుతున్న నటరాజన్, వాషింగ్టన్ సుందర్ తమిళనాడుకి చెందినవారు.. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా చెన్నైలో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ చుట్టూ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు, టీమిండియా మాజీ కెప్టెన్ ఏదో మాట్లాడుతుంటే క్లాస్‌రూమ్‌లో పిల్లలు విన్నట్టు శ్రద్ధగా విన్నారు..

Latest Videos

ఇదే సమయంలో తమిళనాడు లోకల్ భాయ్ టి నటరాజన్, తన ఫ్యామిలీని మహేంద్ర సింగ్ ధోనీకి పరిచయం చేశాడు. ధోనీకి పిల్లలంటే భలే ఇష్టం. వారితో కలిసి ఆడుతూ, కలిసిపోయి తెగ అల్లరి చేస్తుంటాడు మహేంద్ర సింగ్ ధోనీ...

కూతురు హన్వికని ఎత్తుకున్న నిలబడిన టి నటరాజన్ దగ్గరకి వెళ్లిన మాహీ, ఆమెతో చేతులు కలిపేందుకు ప్రయత్నించాడు. అయితే రెండున్నరేళ్ల హన్విక, మాహీని చూసి భయపడి, అతనితో హైఫై ఇచ్చేందుకు ఇష్టపడలేదు...  నట్టూ కూడా ధోనీకి హైఫై ఇవ్వాల్సిందిగా కోరినా కూడా చేతులు వెనక్కి లాగేసుకుంది...

పాపను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించిన మహేంద్రుడు, ‘నాకూ కూతురు ఉంది. ఇంత ఉంటుంది..’ అంటూ చేతులతో చూపించాడు. అయితే హన్విక, ధోనీ మాటలకు ‘ఏది? ఎక్కడుంది?’ అని అడిగింది. అక్కడితో ఆగకుండా ‘తమ్ముడు లేడా?’ అంటూ క్యూట్‌గా అడిగింది. దానికి ధోనీ.. ‘లేడు... ఓన్లీ వన్ డాటర్...’ అంటూ సమాధానం ఇచ్చాడు..

A dose of kutty chutties to make your day! 🦁💛 pic.twitter.com/Fx4gywH6aW

— Chennai Super Kings (@ChennaiIPL)

ఆ తర్వాత ఓ ఫోటో దిగుదాం అని నట్టూ ఫ్యామిలీతో ఫోటో దిగాడు. ధోనీ కూతురు జీవా సింగ్, తనకు రెండేళ్లు ఉన్నప్పటి నుంచి సీ‌ఎస్‌కే ఆడే మ్యాచులకు వచ్చేది, ముఖ్యంగా చెన్నైలో జరిగే ప్రతీ మ్యాచ్‌లో జీవా, సాక్షి సింగ్ ఉండేవాళ్లు. ధోనీ సిక్సర్ కొట్టినా, క్యాచ్ పట్టినా అరుస్తూ, కేకలు వేస్తూ తండ్రిని ఎంకరేజ్ చేస్తూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేది జీవా సింగ్...

అయితే ఐపీఎల్ 2023 సీజన్‌లో జీవా సింగ్‌ ఇప్పటిదాకా స్టేడియంలో కనిపించలేదు. ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ కావడంతో ఎమోషనల్‌ అవ్వకూడదని జీవా సింగ్‌ని స్టేడియానికి దూరంగా పెట్టాడా? లేక మరేదైనా కారణం ఉందా... అనేది తెలియాల్సి ఉంది. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో టి నటరాజన్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. భారీగా పరుగులు ఇచ్చేస్తుండడంతో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నట్టూకి తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే సొంత మైదానంలో నటరాజన్‌ని ఆడించి ఉంటే, వికెట్లు రాబట్టేవాడని కామెంట్లు వినిపించాయి.. 

 

 

click me!