మరో టీమ్ జెర్సీ రంగు మారబోతోంది.. కేకేఆర్‌తో మ్యాచ్‌కు డిఫరెంట్ జెర్సీతో రానున్న లక్నో

Published : May 18, 2023, 05:37 PM IST
మరో టీమ్ జెర్సీ రంగు మారబోతోంది.. కేకేఆర్‌తో మ్యాచ్‌కు డిఫరెంట్ జెర్సీతో రానున్న లక్నో

సారాంశం

IPL 2023: ఐపీఎల్ -2023లో  ఇదివరకే పలు ఫ్రాంచైజీలు ఒక మ్యాచ్ కోసం తమ రెగ్యులర్ జెర్సీలలో కాకుండా  డిఫరెంట్   కలర్ జెర్సీలలో దర్శనమిచ్చారు. 

ఐపీఎల్  -16 ప్లేఆఫ్స్ రేసులో  భాగంగా ఇటీవలే ముంబై ఇండియన్స్ తో జరిగిన కీలక పోరులో ఐదు సార్లు  ఛాంపియన్స్ ను ఓడించి టాప్ - 3 కి దూసుకెళ్లిన లక్నో సూపర్ జెయింట్స్  తాము  ఈ సీజన్ లో తర్వాత ఆడబోయే ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఆ జట్టు తమ రెగ్యులర్ జెర్సీ (బ్లూ కలర్)   లలో కాకుండా  మరో రంగు దుస్తులలో  అలరించబోతున్నారు.

కోల్కతా నైట్ రైడర్స్ తో  లక్నో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో  లక్నో ఆటగాళ్లు..  దేశంలో ప్రముఖ ఫుట్‌బాల్ ఫ్రాంచైజీ అయిన ఏటీకే మోహన్ బగన్  ఆటగాళ్లు ధరించే  జెర్సీని వేసుకోనున్నారు.  

ఈ మేరకు లక్నో తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.  మే 20న ఈడెన్ గార్డెన్ వేదికగా  లక్నో.. కేకేఆర్ తో మ్యాచ్ ఆడనుంది.  కాగా మోహన్ బగన్  ఫ్రాంచైజీ ఓనర్, ఐపీఎల్ లో లక్నో  టీమ్ ఓనర్ ఇద్దరూ ఒకరే కావడం విశేషం.   ఈ రెండు టీమ్స్ కు సంజీవ్ గొయెంకా యజమాని.  మోహన్ బగన్ టీమ్ కు ట్రిబ్యూట్ ఇచ్చేందుకే  వాళ్ల జెర్సీని వేసుకుంటున్నట్టు   లక్నో ఒక ప్రకటనలో తెలిపింది.  

 

మెరూన్, గ్రీన్ కలర్ మిక్స్ లలో ఉండే ఈ జెర్సీ వేసుకోవడానికి లక్నో టీమ్ కు మరో  సందర్భం కూడా ఉంది. ఈ మ్యాచ్ జరిగేది కోల్కతాలో.. మోహన్ బగన్  ఫ్రాంచైజీకి కూడా కోల్కతాతో విడదీయరాని అనుబంధముంది.   అదీగాక కోల్కతా నైట్ రైడర్స్ కు రెండు ఐపీఎల్ ట్రోఫీలను అందించిన సారథి గౌతం గంభీర్ ఇప్పుడు  లక్నోకు మెంటార్ గా వ్యవహరిస్తుండటం గమనార్హం. 

ఈ సీజన్ లో ఒక టీమ్ జెర్సీని మార్చి ఆడటం ఇదే ప్రథమం కాదు.  ఐపీఎల్ -16 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..  రాజస్తాన్ రాయల్స్ తో మ్యాచ్ లో తమ  గ్రీన్ జెర్సీని   వేసుకుని మ్యాచ్ ఆడింది. ముంబై కూడా  ఓ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ముంబై ఇండియన్స్ మహిళల  జెర్సీని వేసుకుంది. ఇటీవలే గుజరాత్ టైటాన్స్ కూడా  సన్ రైజర్స్ తో మ్యాచ్ లో లావెండర్ జెర్సీని వేసుకుని ఆడింది. ఈ క్రమంలో ఇప్పుడు  లక్నో కూడా చేరింది. 

 

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026: షాకిచ్చారు భయ్యా.. స్టార్ ప్లేయర్లను బయటకు పంపించేశారు !
T20 World Cup India Squad : ప్రత్యర్థులకు దడ.. ఇది టీమిండియా నయా అడ్డా