IPL2023: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. కోల్‌కత్తాలో కేకేఆర్ బోణీ కొడుతుందా..

Published : Apr 06, 2023, 07:05 PM ISTUpdated : Apr 06, 2023, 08:20 PM IST
IPL2023: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. కోల్‌కత్తాలో కేకేఆర్ బోణీ కొడుతుందా..

సారాంశం

IPL 2023 సీజన్ ఆనవాయితీని కొనసాగిస్తూ టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకున్న ఫాఫ్ డుప్లిసిస్... 

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడుతోంది. టాస్ గెలిచిన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది..

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతుల్లో 7 పరుగుల తేడాతో (డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) ఓడింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుని, జోష్‌లో ఉంది..

విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ కూడా తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీలు చేశారు. మొదటి మ్యాచ్‌లో ఈ ఇద్దరూ తొలి వికెట్‌కి 148 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడం వల్ల మిగిలిన వారికి పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు...

దినేశ్ కార్తీక్ డకౌట్ కాగా గ్లెన్ మ్యాక్స్‌వెల్ వస్తూనే రెండు సిక్సర్లు బాదేశాడు. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ గాయంతో ఐపీఎల్ 2023 సీజన్‌కి దూరం కావడంతో కోల్‌కత్తా కష్టాల్లో ఉంది. తొలి మ్యాచ్‌లో వర్షం కారణంగా 7 పరుగుల తేడాతో ఓడినా పూర్తి మ్యాచ్ సాగి ఉంటే కేకేఆర్ మరింత ఘోరంగా ఓడి ఉండేది. 


కారణం తొలి మ్యాచ్‌లో కేకేఆర్ బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. టిమ్ సౌథీ 4 ఓవర్లలో 54 పరుగులు సమర్పిస్తే శార్దూల్ ఠాకూర్ 4 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చాడు. సునీల్ నరైన్ కూడా 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చేశాడు. సీనియర్ మోస్ట్ ఫాస్ట్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు...

బ్యాటింగ్‌లోనూ కేకేఆర్ బ్యాటర్ల నుంచి ఆశించిన స్థాయిలో మెరుపులు రాలేదు. అయితే కేకేఆర్ ప్రధాన బలం ఆండ్రే రస్సెల్‌కి ఆర్‌సీబీపైన అదిరిపోయే రికార్డు ఉంది. ఈడెన్ గార్డెన్స్‌లో 29 మ్యాచులు ఆడిన ఆండ్రే రస్సెల్, 24 ఇన్నింగ్స్‌ల్లో 699 పరుగులు చేశాడు. ఇక్కడ రస్సెల్ స్ట్రైయిట్ రేటు 200పైనే ఉంది..

అలాగే విరాట్ కోహ్లీపై సునీల్ నరైన్‌కి, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై ఉమేశ్ యాదవ్‌కి మంచి రికార్డులు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో 19 బాల్స్ ఆడిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, 17 పరుగులు మాత్రమే చేసి 3 సార్లు అవుట్ అయ్యాడు..

గాయపడిన శ్రేయాస్ అయ్యర్ స్థానంలో జాసన్ రాయ్‌ని జట్టులోకి తీసుకుంది కేకేఆర్. అయితే అతను ఈ మ్యాచ్‌లో ఆడడం లేదు. షకీబ్ అల్ హసన్, ఐపీఎల్ నుంచి తప్పుకోగా లూకీ ఫర్గూసన్ గాయంతో బాధపడుతున్నాడు. నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్ ఏ మ్యాచ్‌లో ఆడతారో వాళ్లకే తెలీదు. దీంతో కేకేఆర్ కష్టాలను ఎవరు తీరుస్తాయో చూడాలి..

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ టీమ్: మన్‌దీప్ సింగ్, రహ్మనుల్లా గుర్భాజ్, నితీశ్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రే రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, సుయాశ్ శర్మ, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్ (కెప్టెన్), దినేశ్ కార్తీక్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మైఖేల్ బ్రాస్‌వెల్, షాబజ్ అహ్మద్, డేవిడ్ విల్లే, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?