IPL 2023: రాజస్తాన్‌తో కోల్కతా కీ ఫైట్.. గెలిస్తేనే ఇరు జట్లకూ ప్లేఆఫ్ ఆశలు సజీవం.. టాస్ ఓడిన కేకేఆర్

Published : May 11, 2023, 07:05 PM ISTUpdated : May 11, 2023, 07:10 PM IST
IPL 2023: రాజస్తాన్‌తో కోల్కతా కీ ఫైట్.. గెలిస్తేనే ఇరు జట్లకూ ప్లేఆఫ్ ఆశలు సజీవం.. టాస్ ఓడిన కేకేఆర్

సారాంశం

IPL 2023, KKR vs RR:ఐపీఎల్-16లో  లీగ్ దశ మ్యాచ్ లు దాదాపు చివరి స్టేజ్ కు చేరుకున్నాయి.  ఇకనుంచి  ప్రతీ జట్టు ఆడబోయే మ్యాచ్ ఎంతో కీలకం.  అటువంటి కీ ఫైట్ లో నేడు రాజస్తాన్-కోల్కతా లు పోటీ పడనున్నాయి.

ఐపీఎల్-16 లో  లీగ్ దశ  పోటీలు ముగింపునకు చేరుకున్నాయి. దాదాపు అన్ని జట్లూ 11 మ్యాచ్‌లు ఆడాయి.  మరో మూడు మ్యాచ్ లే  వారి ఖాతాలలో మిగిలున్న నేపథ్యంలో   ఇకనుంచి ప్రతీ పోరూ డూ ఆర్ డై వంటిదే.  నేడు కూడా రాజస్తాన్ రాయల్స్ - కోల్కతా నైట్ రైడర్స్ మధ్య అటువంటి పోరే  జరుగనుంది.   ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతన్న ఈ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి మొదలు బౌలింగ్ చేయనుంది. కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్  కు రానుంది. 

ప్లేఆఫ్స్  రేసులో   పోటీ పడుతున్న ఈ రెండు జట్లలో  నేడు గెలిచిన  విజేత  ఆ దిశగా తమ స్థానాన్ని మరింత   పటిష్టం చేసుకోనుంది.   ఈ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్  11 మ్యాచ్ లు ఆడి ఐదు గెలిచి ఆరింట్లో ఓడి పది పాయింట్లతో  ఐదో స్థానంలో ఉంది.   కేకేఆర్ కూడా ఇవే  పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. 

ఈ సీజన్ ప్రారంభంలో  ఆడిన మొదటి  ఐదు మ్యాచ్ లలో నాలుగు గెలిచి ఒక దశలో టేబుల్ టాపర్లుగా ఉన్న  రాజస్తాన్ తర్వాత గాడి తప్పింది.  తర్వాతి ఆరు మ్యాచ్ లలో   ఆ జట్టు  ఏకంగా ఐదింట్లో ఓడి  ప్లేఆఫ్స్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది. గత మ్యాచ్ లో హైదరాబాద్ తో  కూడా ఓడిన ఆ జట్టుకు  కేకేఆర్ తో గెలవడం అత్యావశ్యకం.  ఈ మ్యాచ్ గెలిస్తే సంజూ శాంసన్ సేన మూడో  స్థానానికి వెళ్లొచ్చు.  

ఇక ఇటీవలే  పంజాబ్ తో మ్యాచ్ కు ముందు వరకూ  పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న  కేకేఆర్..   ఆ మ్యాచ్ లో అనూహ్యమైన విజయాన్ని అందుకుని  ఏకంగా ఐదో స్థానానికి ఎగబాకింది.  నేడు కూడా  రాజస్తాన్ ను ఓడిస్తే  ప్రస్తుతం  ఐదో స్థానంలో ఉన్న ఆ జట్టు నాలుగో స్థానానికి  చేరే అవకాశాలు మెండుగా ఉంటాయి. మరి నితీశ్ రాణా  గ్యాంగ్ తమ సొంత గ్రౌండ్ లో ఏం చేస్తారో చూడాలి.  

 

తుది జట్లు : 

కోల్కతా నైట్ రైడర్స్ : రహ్మనుల్లా గుర్బాజ్, జేసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా,  వరుణ్ చక్రవర్తి 

రాజస్తాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), జో రూట్, షిమ్రన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, కెఎం అసిఫ్, యుజ్వేంద్ర చాహల్ 
 

PREV
click me!

Recommended Stories

Indian Cricket: టెస్టుల్లో 300, వన్డేల్లో 200, ఐపీఎల్‌లో 100.. ఎవరీ మొనగాడు?
IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?