IPL 2023: భారీ విజయమే లక్ష్యంగా లక్నో.. షాకిచ్చేందుకు కోల్కతా రెడీ.. టాస్ గెలిచిన నైట్ రైడర్స్

Published : May 20, 2023, 07:04 PM ISTUpdated : May 20, 2023, 07:16 PM IST
IPL 2023: భారీ విజయమే లక్ష్యంగా లక్నో.. షాకిచ్చేందుకు  కోల్కతా రెడీ.. టాస్ గెలిచిన నైట్ రైడర్స్

సారాంశం

IPL 2023, KKR vs LSG: ఐపీఎల్ - 16 లో  ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకున్న  లక్నో  సూపర్ జెయింట్స్..  కోల్కతా నైట్ రైడర్స్ తో  ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. 

ఐపీఎల్  - 16 లో ఇదివరకే   పాయింట్ల పట్టికలో  మూడో స్థానంలో నిలిచిన  లక్నో సూపర్ జెయింట్స్..  కీలక  మ్యాచ్ లో   కోల్కతా నైట్ రైడర్స్ తో  తలపడనుంది.   ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో  టాస్ గెలిచిన  కోల్కతా నైట్ రైడర్స్ ఫస్ట్  టాస్ గెలిచి  బౌలింగ్  ఎంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ టాస్ ఓడి  బ్యాటింగ్  చేయనుంది. 

ఢిల్లీతో  మ్యాచ్ లో  చెన్నై విజయం దిశగా దూసుకెళ్తుండటంతో  ఆ జట్టు  టాప్ - 2 ప్లేస్ ను  దక్కించుకోనుంది. ఈ నేపథ్యంలో  భారీ  తేడాతో గెలిస్తేనే లక్నోకు  చెన్నైకి పోటీనిచ్చే  అవకాశం ఉంటుంది.  లేదంటే ఆ జట్టు టాప్ - 3 కే  పరిమితమవుతుంది. 

టాప్  - 3లో ఉంటే  లక్నోకు ప్రమాదం లేకపోలేదు. పాయింట్ల పట్టికలో  నాలుగు, ఆరో స్థానాల్లో ఉన్న  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,  ముంబై ఇండియన్స్ లు తమ ఆఖరి లీగ్ మ్యాచ్ గెలిస్తే అప్పుడు లక్నోకు కష్టాలు తప్పవు.  

 కోల్కతాతో మ్యాచ్ లో  లక్నో ఓడితే  అప్పుడు దాని పాయింట్లు 15 గానే ఉంటాయి.  ఒకవేళ  ముంబై.. హైదరాబాద్ ను భారీ తేడాతో ఓడిస్తే  ఆ జట్టు ఖాతాలో  16 పాయింట్లు చేరతాయి.  ఇది లక్నోకు మొదటికే మోసం.  మరోవైపు  ఆర్సీబీ కూడా తమ చివరి లీగ్ మ్యాచ్ లో గుజరాత్ ను ఓడిస్తే  ఆ జట్టుకూ  16 పాయింట్లు చేరతాయి.  మెరుగైన రన్ రేట్ ఆధారంగా    ఆర్సీబీ, ముంబైలు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు మెరుగుపడుతాయి.  ఈ మ్యాచ్ లో గెలిచినా ఓడినా కోల్కతాకు వచ్చిన నష్టమేమీ లేదు.  మరి ఈ మ్యాచ్ లో లక్నోకు   కోల్కతా షాక్ ఇస్తుందా..? లేదా లక్నో గెలిచి ప్లేఆఫ్స్ బెర్త్ ను ఖాయం చేసుకుంటుందో..? వేచి చూడాలి. 

 

తుది జట్లు : 

కోల్కతా నైట్ రైడర్స్ : రహ్మనుల్లా గుర్బాజ్, జేసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా (కెప్టెన్),  ఆండ్రీ రసెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి 

లక్నో సూపర్ జెయింట్స్ :  క్వింటన్ డికాక్, కరణ్ శర్మ, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా (కెప్టెన్), అయుష్ బదోని,  కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్ 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు