జడ్డూలా మారిన వార్నర్.. ఢిల్లీ - చెన్నై మ్యాచ్‌లో లవ్లీ మూమెంట్.. వీడియో వైరల్

Published : May 20, 2023, 06:32 PM IST
జడ్డూలా మారిన వార్నర్.. ఢిల్లీ - చెన్నై మ్యాచ్‌లో  లవ్లీ మూమెంట్.. వీడియో వైరల్

సారాంశం

IPL 2023: ఐపీఎల్ - 16 లో  ఢిల్లీ క్యాపిటల్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఢిల్లీ వేదికగా  జరుగుతున్న మ్యాచ్ లో వార్నర్ -  జడేజాల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 

ఐపీఎల్ - 16  లో భాగంగా ప్లేఆఫ్స్  రేసులో టాప్ - 2 ప్లేస్ కోసం పోటీ పడుతున్న  చెన్నై సూపర్ కింగ్స్..  ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో  జరుగుతున్న తమ ఆఖరి లీగ్ మ్యాచ్ లో  విజయం దిశగా దూసుకెల్తున్నది.   ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా - డేవిడ్ వార్నర్ ల మధ్య లవ్లీ సీన్  చోటు చేసుకుంది.   జడ్డూ ఫిఫ్టీ, హండ్రెడ్ చేసేప్పుడు   సెలబ్రేట్ చేసుకునే విధంగా  వార్నర్ కూడా.. బ్యాట్ తో ఇలా చేసుకొచ్చాడు. 

చెన్నై నిర్దేశించిన  224 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా  ఛేదనకు వచ్చిన  ఢిల్లీ ఇన్నింగ్స్ లో   దీపక్ చాహర్ ఐదో ఓవర్ వేశాడు. ఈ ఓవర్లో  చాహర్ వేసిన నాలుగో బాల్ కు వార్నర్  కవర్స్ దిశగా ఆడాడు.  వార్నర్   పరుగు కోసం యత్నించాడు.  కవర్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న   మోయిన్ అలీ..  వికెట్ల వైపు త్రో విసిరాడు. కానీ బాల్ మిస్ అయింది.  

దీంతో వెంటనే  బంతి అందుకున్న  రహానే..  రనౌట్ కోసం కవ్విస్తున్న వార్నర్ ను  అప్పటికే క్రీజు దాటడంతో  రనౌట్ చేసేందుకు ట్రై చేశాడు.  వార్నర్ క్రీజుకు కాస్త దూరంగానే ఉండటంతో  రహానే బాల్  ను వికెట్ల వైపునకు విసిరాడు.  కానీ ఆ బంతి కాస్తా  మిస్ అయింది.   రనౌట్ చేసే క్రమంలో    డైవ్ చేసిన వార్నర్.. మళ్లీ పరుగు తీసేందుకు   సిద్దమయ్యాడు. కానీ ఈసారి బాల్ జడేజా దగ్గర ఉంది.   అప్పుడు  ఈ ఇద్దరి మధ్య ఫన్నీ సీన్ జరిగింది. జడ్డూ  వికెట్ల వైపునకు గురి పెట్టగా.. వార్నర్, జడేజా బ్యాట్ ను కత్తిలా తింపుతూ  సెలబ్రేట్ చేసుకున్నట్టుగా చేశాడు.  దీంతో   ఫీల్డ్ లో నవ్వులు విరబూశాయి.  ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.  

 

కాగా ఈ మ్యాచ్ లో  టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన  చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి  223 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్  (79), డెవాన్ కాన్వే (87) లతో పాటు  చివర్లో శివమ్ దూబే  (22), రవీంద్ర జడేజా(20 నాటౌట్) లు రాణించి  చెన్నైకి భారీ స్కోరును అందించారు.  

లక్ష్య ఛేదనలో ఢిల్లీ..   12 ఓవర్లు ముగిసేసరికి   4 వికెట్లు కోల్పయి  834పరుగులు చేసింది.   పృథ్వీ షా  (5), ఫిలిప్  సాల్ట్ (3), రిలీ రూసో (0), యశ్ ధుల్ (13) లు విఫలమయ్యార.  డేవిడ్ వార్నర్ (54 నాటౌట్), అక్షర్ పటేల్ (7 నాటౌట్)  లు క్రీజులో ఉన్నారు.  

 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు