IPL 2023 KKR vs CSK: టాస్ గెలిచిన కేకేఆర్... జోరుమీదున్న చెన్నై సూపర్ కింగ్స్...

By Chinthakindhi RamuFirst Published Apr 23, 2023, 7:04 PM IST
Highlights

IPL 2023: టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌... వరుస విజయాలతో జోరు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్... వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిన కేకేఆర్..

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ జట్టు కెప్టెన్ నితీశ్ రాణా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది...

శార్దూల్ ఠాకూర్ సెన్సేషనల్ ఇన్నింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై, రింకూ సింగ్ సిక్సర్ల సునామీతో గుజరాత్ టైటాన్స్‌తో వరుస విజయాలు అందుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్... ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లోనూ ఓడింది.

Latest Videos

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పోరాడి ఓడిన కేకేఆర్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచుల్లో పేలవ ప్రదర్శన కనబర్చింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ సెంచరీ చేసినా బౌలింగ్‌లో విఫలమైన కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 127 పరుగులకి ఆలౌట్ అయ్యింది..

ఒకటి రెండు మ్యాచుల్లో అదరగొట్టిన నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్.. ఆ ప్రదర్శనను కొనసాగించలేకపోతున్నారు. అలాగే బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఆకట్టుకుంటున్నా ఫాస్ట్ బౌలర్లు శార్దూల్ ఠాకూర్, లూకీ ఫర్గూసన్ నుంచి ఆశించిన పర్ఫామెన్స్ రావడం లేదు...

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతంది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో ఓడిన తర్వాత ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లపై వరుస విజయాలు అందుకున్న సీఎస్‌కే... ప్రస్తుతం 6 మ్యాచుల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది..

డివాన్ కాన్వేతో పాటు రుతురాజ్ గైక్వాడ్, అజింకా రహానే, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, మొయిన్ ఆలీ... చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. అలాగే సీఎస్‌కే బౌలర్లు మతీశ్ పథిరాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్ కూడా అదరగొడుతున్నారు..

గత సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడిన నారాయణ్ జగదీశన్, ఈ సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కి ఓపెనర్‌గా ఉన్నాడు. తన పాత టీమ్‌పైన జగదీశన్ ఎలా ఆడతాడో చూడాలి. 

గత రెండు మూడు మ్యాచుల్లో మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌కి రాకపోవడంతో అతని అభిమానులు తీవ్రంగా నిరాశకు గురయ్యాడు. ఇది చివరి ఐపీఎల్ సీజన్ అని ధోనీ ప్రకటించడంతో ఇప్పటికైనా మాహీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ తీసుకుని వచ్చి.. బ్యాటింగ్‌ చేయాలని కోరుకుంటున్నారు అభిమానులు. మరి మాహీ ఫ్యాన్స్ కోరిక నేటి మ్యాచ్‌లో అయినా నెరవేరుతుందో లేదో చూడాలి. 

కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు ఇది: నారాయణ్ జగదీశన్, జాసన్ రాయ్, నితీశ్ రాణా (కెప్టెన్), ఆండ్రే రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, డేవిడ్ వీజ్, కుల్‌వత్ కెజ్రోలియా, సుయాశ్ శర్మ, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

 చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇది: డివాన్ కాన్వే, అజింకా రహానే, మొయిన్ ఆలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), మతీశ పథిరాణా, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ

click me!