జియో కస్టమర్లకు షాక్! ఒక్క ఐపీఎల్ మ్యాచ్ చూడాలంటే ఏ డేటా ప్యాక్ సరిపోదు... 25 జీబీ ఉంటేనే..

Published : Feb 22, 2023, 11:18 AM IST
జియో కస్టమర్లకు షాక్! ఒక్క ఐపీఎల్ మ్యాచ్ చూడాలంటే ఏ డేటా ప్యాక్ సరిపోదు... 25 జీబీ ఉంటేనే..

సారాంశం

IPL 2023: 4K రిజల్యూషన్‌లో ఐపీఎల్ మ్యాచులు చూసేందుకు 25జీబీ డేటా.. HD మ్యాచులు చూసేందుకు 12జీబీ డేటా... సాధారణ క్వాలిటీ వీడియో చూడాలన్నా 2జీబీ డేటా అవసరం?... 

ఐపీఎల్ 2023 ప్రసార హక్కులను సొంతం చేసుకుంది వయాకాం18. ఐపీఎల్ 2023 సీజన్ ప్రసారాలను ఉచితంగా 12 భాషల్లో అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది జియో. 4K రెజల్యూషన్‌లో, అత్యాధునిక పద్ధతుల్లో ఐపీఎల్ మ్యాచులు చూసేందుకు, వినియోగదారులకు సరికొత్త అనుభూతులను అందించేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది జియో సినిమా. అయితే సామన్యులకు ఈ టెక్నాలజీ హంగులు దొరకడం కష్టంగానే కనిపిస్తోంది..

డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఓ ఐపీఎల్ మ్యాచ్ పూర్తిగా చూసేందుకు 500 ఎంబీ నుంచి 700 ఎంబీ వరకూ డేటా అవసరం అయ్యేది. అంటే రోజుకి 1జీబీ డేటా ప్యాక్ రీఛార్జ్ చేసుకున్నా సరిపోయేది. అయితే జియో సినిమాలో సాధారణ క్వాలిటీతో మ్యాచ్ చూడాలంటే కనీసం 2 జీబీ అవసరం అవుతుంది...

అంటే డైలీ 2 జీబీ డేటా ప్యాక్ రీఛార్జ్ చేసుకున్నా సరిపోవడం కష్టమే... మ్యాచ్ ప్రారంభమయ్యేది సాయంత్రం 7:30కి కాబట్టి ఆ లోపు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వ్యాట్సాఫ్ వివిధ యాప్‌లు వాడేందుకు 100 ఎంబీ డేటా వాడితే.. ఐపీఎల్ మ్యాచ్ క్లైమాక్స్‌లో ఉన్నప్పుడు మీ డేటా అయిపోవడం గ్యారెంటీ...

HD క్వాలిటీలో ఐపీఎల్ మ్యాచులు చూడాలంటే కనీసం 12 జీబీ డేటా కావాల్సిందే. అదే 4K రిజల్యూషన్‌లో ఐపీఎల్ మ్యాచులు ఎంజాయ్ చేయాలంటే ఎంతలేదన్నా 25జీబీ డేటా ఉండాలి. అంటే డైలీ 1 జీబీ, 1.5 జీబీ, 2 జీబీ డేటా ప్యాక్‌లతో రీఛార్జ్ చేసుకునేవాళ్లు, సాధారణ క్వాలిటీతో మ్యాచులు చూడాలంటే కూడా మళ్లీ అదనపు టాప్-అప్ ప్యాక్‌లు వేసుకోవాల్సిందే...

వైఫై కనెక్షన్ ఉన్నవాళ్లు ఈ విషయంలో సేఫ్ అయిపోవచ్చు. అయితే మొబైల్ ఫోన్లలో మ్యాచులు వీక్షించే చాలామంది, వైఫై కనెక్షన్‌కి దూరంగా ఉంటున్నవాళ్లే. దీంతో ఐపీఎల్‌పై భారీ నమ్మకాలు పెట్టుకున్న జియో ప్లాన్ వర్కవుట్ అవుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది..  

ఐపీఎల్ డిజిటల్ మీడియా రైట్స్‌ని రూ.23,773 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారాల్లో సరికొత్త విప్లవాన్ని తీసుకురానుంది. 4K రెజల్యూషన్‌తో పాటు 12 భాషల్లో కామెంటరీని అందించనుంది జియో సినిమా.. అలాగే గ్రౌండ్‌లో 360 డిగ్రీస్‌లో మ్యాచ్‌ని వీక్షించేందుకు వినియోగదారులకు అవకాశం దక్కనుంది. అంటే VR టెక్నాలజీతో అచ్చు గ్రౌండ్‌లో ఉన్నట్టుగానే జియో సినిమా యాప్‌లో మ్యాచ్‌ని ఇంటి నుంచే వీక్షించవచ్చు...

టీవీల్లో లాగా కెమెరామెన్ చూపించిన యాంగిల్‌లోనే కాకుండా స్టంప్ కెమెరా నుంచి, లేదా మరో యాంగిల్‌లో ఉన్న కెమెరా నుంచి మ్యాచ్‌ని చూడాలనుకున్నా... ఆ సదుపాయం కూడా జియో సినిమా యాప్‌లో దొరకనుంది... అంతేకాదు మ్యాచ్ సమయంలో ఏ విషయంలో అయినా అనుమానం వస్తే, నేరుగా కామెంటేటర్లతో ఛాట్ చేసి తెలుసుకోవచ్చు. ఛాట్ విత్ కామెంటేటర్ ఆప్షన్‌ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది జియో సినిమా...

వీటితో పాటు బాలీవుడ్‌ ‘బిగ్‌ బీ’ అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఓ లైవ్ క్విజ్ ప్రోగ్రామ్ నిర్వహించేందుకు కూడా వయాకామ్18 మీడియా సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఈ క్విజ్‌లో గెలిచిన వారికి బహుమతులు కూడా ఉంటాయి. అంతేకాకుండా ప్లేయర్ల గురించి, ఫ్రాంఛైజీల గురించి, మ్యాచ్ గురించి సమగ్ర సమాచారాన్ని గణాంకాల రూపంలో తెలుసుకునేందుకు కూడా వెసులుబాటు కలిగించనుంది జియో సినిమా...

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు
IND vs SA : టీ20 క్రికెట్ అంటే అంతే బాసూ.. సూర్యకుమార్ యాదవ్ భయం అదే !