IPL 2023: లో స్కోరింగ్ గేమ్‌లో టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ... 136 కొట్టలేక ఓడిన లక్నో, రాహుల్ పోరాడినా...

Published : Apr 22, 2023, 07:15 PM IST
IPL 2023: లో స్కోరింగ్ గేమ్‌లో టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ... 136 కొట్టలేక ఓడిన లక్నో, రాహుల్ పోరాడినా...

సారాంశం

IPL 2023: ఆఖరి ఓవర్ సాగిన లో స్కోరింగ్ గేమ్‌లో ఉత్కంఠ విజయం అందుకున్న గుజరాత్ టైటాన్స్. చివరి ఓవర్‌లో 4 వికెట్లు కోల్పోయిన లక్నో సూపర్ జెయింట్స్... 

ఐపీఎల్ 2023: 136 పరుగుల చిన్న టార్గెట్.. మంచి ఆరంభం దక్కడంతో 33 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితికి చేరుకున్న లక్నో సూపర్ జెయింట్స్. ఇక ఈజీగా లక్నో గెలుస్తుందని అనుకున్నారంతా. అయితే గుజరాత్ టైటాన్స్ బౌలర్లు అద్భుత పోరాడంతో మ్యాచ్‌ని మలుపు తిప్పారు. చిన్న టార్గెట్టే కదా మెల్లిగా కొట్టొచ్చని ఆఖరి ఓవర్ సాగదీసిన లక్నోకి మోహిత్ శర్మ.. ఊహించని షాక్ ఇచ్చాడు. చివరి ఓవర్‌లో ఏకంగా 4 వికెట్లు కోల్పోయిన లక్నో, 7 పరుగుల తేడాతో ఓడింది. 

136 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనని ధాటిగా ఆరంభించింది లక్నో సూపర్ జెయింట్స్. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ మొదటి ఓవర్ మెయిడిన్ ఆడాడు కెఎల్ రాహుల్.  కైల్ మేయర్స్, కెఎల్ రాహుల్ కలిసి తొలి వికెట్‌కి 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేసిన కైల్ మేయర్స్, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

కృనాల్ పాండ్యా 6 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ని అభినవ్ మనోహార్ జారవిడిచాడు. కెఎల్ రాహుల్ 38 బంతుల్లో 8 ఫోర్లతో 50 పరుగులు పూర్తి చేసుకోగా.. 23 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు...

అయితే అప్పటికే 33 బంతుల్లో 30 పరుగులు కావాల్సిన పొజిషన్‌కి చేరుకుంది  లక్నో సూపర్ జెయింట్స్. 7 బంతులు ఆడిన నికోలస్ పూరన్ 1 పరుగు మాత్రమే చేసి నూర్ అహ్మద్ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

దీంతో లక్నో విజయానికి ఆఖరి 3 ఓవర్లలో 23 పరుగులు కావాల్సి వచ్చాయి. మోహిత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో 6 సింగిల్స్ మాత్రమే వచ్చాయి. 19వ ఓవర్ వేసిన మహ్మద్ షమీ 5 పరుగులు మాత్రమే ఇవ్వడంతో చివరి ఓవర్‌లో లక్నో విజయానికి 12 పరుగులు కావాల్సి వచ్చాయి. మోహిత్ శర్మ వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి బంతికి 2 పరుగులు వచ్చాయి. రెండో బంతికి సిక్సర్ కోసం ట్రై చేసిన కెఎల్ రాహుల్, బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... 61 బంతుల్లో 8 ఫోర్లతో 68 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, జయంత్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో చివరి 4 బంతుల్లో లక్నో విజయానికి 10 పరుగులు కావాల్సి వచ్చాయి.

వస్తూనే షాట్ ఆడేందుకు ట్రై చేసిన స్టోయినిస్, డేవిడ్ మిల్లర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆఖరి 3 బంతుల్లో 10 పరుగులు అవసరమయ్యాయి. ఆ తర్వాత బంతికి ఆయుష్ బదోనీ, దీపక్ హుడా వరుస బంతుల్లో రనౌట్ కావడంతో చివరి ఓవర్‌లో వెంటవెంటనే 4 వికెట్లు కోల్పోయిన లక్నో 4 పరుగులే చేసింది..

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగింది. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌ని డకౌట్ చేశాడు.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన శుబ్‌మన్ గిల్, రవి భిష్ణోయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది గుజరాత్ టైటాన్స్.

రెండో ఓవర్‌లో ఒక్క సింగిల్ మాత్రమే వచ్చింది. వన్‌ డౌన్‌లో వచ్చిన హార్ధిక్ పాండ్యా కూడా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకపోవడంతో స్కోరు వేగం బాగా మందగించింది..

రెండో వికెట్‌కి 68 పరుగుల భాగస్వామ్యం జోడించిన వృద్ధిమాన్ సాహా, 37 బంతుల్లో 6 ఫోర్లతో 47 పరుగులు చేసి కృనాల్ పాండ్యా బౌలింగ్‌లోనే దీపక్ హుడాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

5 బంతుల్లో 3 పరుగులు చేసిన అభినవ్ మనోహార్, సాహా అవుటైన తర్వాతి ఓవర్‌లోనే భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన విజయ్ శంకర్, నవీన్ వుల్ హక్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 


రవి భిష్ణోయ్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో వరుసగా 4, 6, 6 బాదిన హార్ధిక్ పాండ్యా.. హాఫ్ సెంచరీ అందుకోవడమే కాకుండా గుజరాత్ టైటాన్స్ స్కోరును 120 మార్కు దాటించాడు...  

మార్కస్ స్టోయినిస్ వేసిన ఆఖరి ఓవర్‌లో మొదటి బంతికి సిక్సర్ బాదిన హార్ధిక్ పాండ్యా, 55 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 66 పరుగులు చేసి కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. డేవిడ్ మిల్లర్ 12 బంతులు ఆడి 6 పరుగులు చేసి ఆఖరి బంతికి అవుట్ కాగా రాహుల్ తెవాటియా 2 బంతుల్లో 2 పరుగులు చేశాడు. 

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?