
ఐపీఎల్ 2023 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 163 పరుగుల లక్ష్యాన్ని, 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సులువుగా ఛేదించింది గుజరాత్ టైటాన్స్. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఇది వరుసగా రెండో ఓటమి...
7 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, ఆన్రీచ్ నోకియా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 13 బంతుల్లో 3 ఫోర్లతో 14 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ కూడా నోకియా బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యాడు..
కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 5 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 54 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది గుజరాత్ టైటాన్స్. జోషువా లిటిల్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుది జట్టులోకి వచ్చిన విజయ్ శంకర్, సాయి సుదర్శన్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 53 పరుగుల భాగస్వామ్యం జోడించాడు.
23 బంతుల్లో 3 ఫోర్లతో 29 పరుగులు చేసిన విజయ్ శంకర్, మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ అవుటైనట్టు అంపైర్ ప్రకటించినా, డీఆర్‌ఎస్ తీసుకోవడంతో రిప్లైలో నాటౌట్‌గా తేలింది..
ముకేశ్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో 2 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 20 పరుగులు రాబట్టిన డేవిడ్ మిల్లర్, మ్యాచ్‌ని వన్‌సైడ్ చేసేశాడు. ఆన్రీచ్ నోకియా బౌలింగ్‌లో ఫోర్ బాది హాఫ్ సెంచరీ అందుకున్న సాయి సుదర్శన్, అదే ఓవర్‌లో ఆఖరి బంతికి సిక్సర్ రాబట్టాడు..
దీంతో గుజరాత్ టైటాన్స్ విజయానికి ఆఖరి 3 ఓవర్లలో 12 పరుగులే కావాల్సి వచ్చాయి. ఖలీల్ అహ్మద్ వేసిన 18వ ఓవర్‌లో 10 పరుగులు రాగా మిచెల్ మార్ష్ వేసిన 19వ ఓవర్‌లో మ్యాచ్‌ని ముగించేశాడు డేవిడ్ మిల్లర్. సాయి సుదర్శన్ 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేయగా డేవిడ్ మిల్లర్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగుల స్కోరు చేసింది.. 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన పృథ్వీ షా, మహ్మద్ షమీ బౌలింగ్‌లో అల్జెరీ జోసఫ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. షమీ బౌలింగ్‌లో ఓ ఫోర్ బాదిన మిచెల్ మార్ష్, ఆ తర్వాతి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
32 బంతుల్లో 7 ఫోర్లతో 37 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ని అల్జెరీ జోసఫ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి బంతికి రిలే రసో గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
తొలి మ్యాచ్ ఆడుతున్న అభిషేక్ పోరెల్ 11 బంతుల్లో 2 సిక్సర్లతో 20 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 34 బంతుల్లో 2 ఫోర్లతో 30 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు..
రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఓ సిక్సర్ బాదిన ఆమన్ ఖాన్, ఆ తర్వాతి బంతికి అదే స్టైల్‌లో ఇంకో షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు.. మహ్మద్ షమీ వేసిన ఆఖరి ఓవర్‌లో మొదటి బంతికి సిక్సర్ బాదిన అక్షర్ పటేల్, 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఆన్రీచ్ నోకియా ఫోర్ బాదడంతో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 160 పరుగులు దాటింది.
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్, మహ్మద్ షమీ మూడేసి వికెట్లు తీయగా అల్జెరీ జోసఫ్ 2 వికెట్లు తీశాడు.