పస లేదు! ముంబైని మరోసారి చిత్తు చేసిన సీఎస్‌కే... రోహిత్ సేనకి ఇక కష్టమే!

By Chinthakindhi RamuFirst Published May 6, 2023, 7:05 PM IST
Highlights

IPL 2023: ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్... 10 మ్యాచుల్లో ఆరో ఓటమి! ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న రోహిత్ శర్మ టీమ్.. 

ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ ఎల్ క్లాసికోగా అభివర్ణిస్తారు ఫ్యాన్స్. అయితే ఈ రెండు జట్ల మధ్య ఈ సీజన్‌లో జరిగిన మొదటి మ్యాచ్ వన్ సైడెడ్‌గా సాగింది. రెండో మ్యాచ్ కూడా పస లేకుండా సాగి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మరోసారి ముంబై ఇండియన్స్‌పై ఈజీ విక్టరీ అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్... 10 మ్యాచుల్లో ఆరో పరాజయం అందుకున్న ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.. 

140 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్‌కి శుభారంభం దక్కింది.  4 ఓవర్లలోనే 46 పరుగులు రాబట్టారు సీఎస్‌కే ఓపెనర్లు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, పియూష్ చావ్లా బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

Latest Videos

17 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన అజింకా రహానే, పియూష్ చావ్లా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.. రహానే అవుట్ అయ్యాక రెండు ఓవర్లలో 7 పరుగులే రాబట్టగలిగింది సీఎస్‌కే..


ట్రిస్టన్ స్టబ్స్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన అంబటి రాయుడు, 11 బంతుల్లో 12 పరుగులు చేసి, రాఘన్ గోయల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికి సీఎస్‌కే విజయానికి 43 బంతుల్లో 35 పరుగులే కావాలి...

చేయాల్సిన పరుగుల కంటే బంతులు ఎక్కువగా ఉండడంతో సీఎస్‌కే బ్యాటర్లు సింగిల్స్ తీస్తూ, రిస్క్ ఫ్రీ బ్యాటింగ్ చేశారు. 42 బంతుల్లో 4 ఫోర్లతో 44 పరుగులు చేసిన డివాన్ కాన్వే, ఆకాశ్ మద్వాల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూ తీసుకున్న ముంబైకి ఫలితం దక్కింది.. 

అప్పటికి సీఎస్‌కే విజయానికి 20 బంతుల్లో 10 పరుగులే కావాలి. శివమ్ దూబే, ధోనీ కలిసి మ్యాచ్‌ని ముగించారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగుల స్కోరు చేయగలిగింది.  ఓపెనర్‌గా వచ్చిన కామెరూన్ గ్రీన్ 4 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసి, తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..

9 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, దీపక్ చాహార్ బౌలింగ్‌లో తీక్షణకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అదే ఓవర్‌లో 3 బంతులు ఆడిన రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..

ఐపీఎల్ కెరీర్‌లో రోహిత్ శర్మకు ఇది 16వ డకౌట్. కెప్టెన్‌గా 11వ డకౌట్. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ప్లేయర్‌గా, కెప్టెన్‌గా చెత్త రికార్డు నెలకొల్పాడు రోహిత్ శర్మ. 1 

నాలుగో వికెట్‌కి నేహాల్ కలిసి 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన సూర్యకుమార్ యాదవ్, 22 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  

51 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 64 పరుగులు చేసిన నేహాల్ వదేరా, మతీశ పథిరాణా బౌలింగ్‌లో వైడ్ యార్కర్‌కి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 4 బంతులాడి 2 పరుగులు చేసిన టిమ్ డేవిడ్, తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..


వస్తూనే అర్షద్ ఖాన్ ఇచ్చిన క్యాచ్‌ని శివమ్ దూబే జారవిడిచాడు.  అయితే ఆ అవకాశాన్ని పెద్దగా వాడుకోలేకపోయిన అర్షద్ ఖాన్, 2 బంతుల్లో 1 పరుగు చేసి పథిరాణా బౌలింగ్‌లో గైక్వాడ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 
 

click me!