మ్యాచ్ గెలిచినా గుజరాత్‌కు షాక్ తప్పలే.. కేన్ మామ తిరిగొచ్చేనా..? కివీస్ కోచ్ ఆందోళన ఎందుకు..?

Published : Apr 01, 2023, 01:26 PM IST
మ్యాచ్ గెలిచినా  గుజరాత్‌కు షాక్ తప్పలే.. కేన్ మామ  తిరిగొచ్చేనా..? కివీస్ కోచ్ ఆందోళన ఎందుకు..?

సారాంశం

IPL 2023: చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో గెలిచిన  డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ కు  ఈ పోరులో గెలిచినా  షాకు తప్పలేదు.   

డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి  ఈ సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే చెన్నై సూపర్ కింగ్స్ విసిరిన సవాలును  ఛేదించిన గుజరాత్ టైటాన్స్ కు  మొదటి పోరులోనే విజయం దక్కినా  షాక్ తప్పేట్టుగా లేదు.  ఈ సీజన్ లో  ఆ జట్టు దక్కించుకున్న కివీస్ బ్యాటర్ కేన్ విలియమ్సన్..  గాయం కారణంగా  సీజన్ నుంచి తప్పుకునే ప్రమాదంలో పడ్డాడు. 

నిన్నటి మ్యాచ్ లో  సీఎస్కే  13వ ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్   భారీ షాట్ ఆడాడు.   డీప్ స్క్వేర్ లెగ్ దిశగా వెళ్లిన బంతిని  కేన్ విలియమ్సన్ అందుకునే యత్నం చేశాడు.  కొంత దూరం నుంచి  పరుగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు.  గాల్లో ఉండగానే  క్యాచ్ అందుకుని బౌండరీ లైన్ ముందుకు పడేశాడు. 

కానీ   కిందకు ల్యాండ్ అయ్యేప్పుడు  బ్యాలెన్స్ తప్పడంతో  పాటు   మోకాలు కూడా నేలను బలంగా తాకింది. దీంతో  కేన్ గాయంతో విలవిల్లాడు.  పడ్డచోటునే అక్కడే  లేవకుండా   ఉండిపోయాడు.  కేన్ పరిస్థితిని గమనించిన  గుజరాత్ టైటాన్స్ ఫిజియోలు  వచ్చి  అతడికి అక్కడే  ప్రథమ చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో స్టేడియం నుంచి బయటకు తీసుకెళ్లారు. అయితే  మ్యాచ్ జరుగుతుండగా  విలియమ్సన్ గాయం  గురించి  గుజరాత్ మెంటార్ గా ఉన్న గ్యారీ కిర్‌స్టెన్ స్పందిస్తూ.. ‘అతడి మోకాలికి గాయమైంది.   ప్రస్తుతం కేన్ ను మా ఫిజియోలు పరిశీలిస్తున్నారు.  స్కానింగ్  కు కూడా పంపించారు.  అతడి పరిస్థితిపై సమీక్షిస్తున్నాం..’అని చెప్పాడు. 

 

కానీ కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ మాత్రం  ఆందోళనకర వ్యాఖ్యలు చేశాడు.  ‘ఈ విషయం తెలియగానే మేము ఆందోళనకు గురయ్యాం. మేమంతా కేన్ గురించే ఆలోచిస్తున్నాం.  గాయం ఎంత తీవ్రమైందో మాకైతే తెలియడం లేదు.  రాబోయే  48 గంటల పాటు వైద్యులు అతడి పరిస్థితిని సమీక్షించనున్నారు.  ఆ తర్వాతే  ఏ విషయమనేది తెలుస్తుందని కేన్ నాతో చెప్పాడు..’అని స్టెడ్ వివరించాడు. 

కాగా కేన్ కు గాయం కావడంతో  అతడి స్థానంలో సాయి సుదర్శన్..  ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి వచ్చాడు. 17 బంతులు ఆడిన సుదర్శన్.. 3 ఫోర్ల సాయంతో 22 పరుగులు చేశాడు.  ఒకవేళ విలియమ్సన్ గాయం తీవ్రతను బట్టి  గుజరాత్ కూడా రాబోయే మ్యాచ్ లలో తుది జట్టులో మార్పులు చేసుకోవచ్చు. ఇప్పటికే మిల్లర్ లేని లోటు స్పష్టంగా తెలుస్తున్న గుజరాత్ కు కేన్ మామ కూడా దూరమైతే  అది కాస్త ఇబ్బందికర పరిస్థితే. 

 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !