మార్క్‌రమ్ మావ ఎస్ఆర్‌హెచ్‌కు బోణీ కొట్టేనా..? ఐపీఎల్‌లో హైదరాబాద్ కెప్టెన్ ఎంట్రీ నేడే..

Published : Apr 07, 2023, 12:26 PM IST
మార్క్‌రమ్ మావ ఎస్ఆర్‌హెచ్‌కు బోణీ కొట్టేనా..? ఐపీఎల్‌లో హైదరాబాద్ కెప్టెన్ ఎంట్రీ నేడే..

సారాంశం

IPL  2023: సౌతాఫ్రికాలో జరిగిన ఎస్ఎ 20లో  సన్ రైజర్స్ ఈస్ట్రన్ కేప్ కు తొలి ట్రోపీ అందించి ఆ పై ఐపీఎల్ లో ఎస్ఆర్‌హెచ్  సారథ్య బాధ్యతలు చేపట్టిన మార్క్‌రమ్ మావ హైదరాబాద్ రాత మార్చేనా..?

ఐపీఎల్ - 16 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు సారథిగా వ్యవహరిస్తున్న  ఎయిడెన్ మార్క్‌రమ్.. కెప్టెన్ గా ఈ లీగ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సీజన్ లో  సన్ రైజర్స్ ఆడిన తొలి మ్యాచ్ కు మార్క్‌రమ్ అందుబాటులో లేకపోవడంతో  ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం.. సీనియర్ పేసర్ భువనేశ్వర్ తో  తాత్కాలిక సారథిగా   నెట్టుకొచ్చింది. మరి  సౌతాఫ్రికాలో జరిగిన ఎస్ఎ 20లో  సన్ రైజర్స్ ఈస్ట్రన్ కేప్ కు తొలి ట్రోపీ అందించి ఆ పై ఐపీఎల్ లో ఎస్ఆర్‌హెచ్  సారథ్య బాధ్యతలు చేపట్టిన మార్క్‌రమ్ మావ హైదరాబాద్ రాత మార్చేనా..?   ఆ క్రమంలో నేడే అతడికి తొలి పరీక్ష ఎదురుకానుంది.  

ఈనెల 2న హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా  రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో   బ్యాటింగ్, బౌలింగ్  లో విఫలమై దారుణ ఓటమి పాలైన  హైదరాబాద్.. నేడు లక్నో వేదికగా జరుగనున్న మ్యాచ్ లో గెలిచి సీజన్ లో బోణీ కొట్టాలని భావిస్తున్నది.  

హైదరాబాద్ కు    గత మ్యాచ్ లో  మార్క్‌రమ్ తో పాటు  సౌతాఫ్రికా హిట్టర్  హెన్రిచ్ క్లాసెన్ లేని లోటు స్పష్టంగా తెలిసింది.   జట్టులో భువనేశ్వర్ మినహా నిఖార్సైన  పేసర్ కూడా లేడు. ఈ బాధను  మార్కో జాన్సేన్ రూపంలో అధిగమించేందుకు  ఎస్ఆర్‌హెచ్  ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది.  గత మ్యాచ్ లో బ్యాటింగ్ లో విఫలమైన అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి లు  నేడు రాణించడం  హైదరాబాద్ కు  అవసరం. హ్యారీ బ్రూక్ మీద భారీ ఆశలున్నాయి. హెన్రిచ్ క్లాసెన్ టీమ్ లోకి వస్తుండటంతో   గ్లెన్ ఫిలిప్స్  బెంచ్ కే పరిమితం కాక తప్పదు.   అలాగే  ఫజల్ ఫరూఖీ  కూడా  నేటి మ్యాచ్ లో తుది జట్టులో చోటు దక్కించుకోవడం అనుమానమే. 

 

ఎస్ఆర్‌హెచ్ కథ ఇలా ఉంటే లక్నో పరిస్థితి మరో విధంగా ఉంది.  ఆ జట్టు తొలి మ్యాచ్ లో ఢిల్లీని ఓడించినా తర్వాత  చెన్నైతో పోరులో ఓడింది. అయితే   తుది జట్టు విషయంలో  లక్నోకూ  తిప్పలు తప్పేట్లు లేవు.  సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ రాకతో  ఎవర్ని తుది జట్టు నుంచి తప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.   గత రెండు మ్యాచ్ లలో  రాహుల్ కు తోడుగా   వచ్చిన కైల్ మేయర్స్  వీర బాదుడు బాదుతున్నాడు. అతడిని పక్కనబెట్టే సాహసం లక్నో చేయకపోవచ్చు.  అయితే అటు బంతితో, ఇటు బ్యాట్ తో గత రెండు మ్యాచ్ లలో విఫలమైన మార్కస్ స్టోయినిస్ ను    పక్కనబెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  

తుది జట్లు  (అంచనా) : 

సన్ రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, మార్క్‌రమ్  (కెప్టెన్), హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, అదిల్ రషీద్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి.నటరాజన్ 

లక్నో సూపర్ జెయింట్స్ : కెఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, క్వింటన్ డికాక్, దీపక్ హుడా,  నికోలస్ పూరన్, అయూష్ బదోని,  కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, మార్క్ వుడ్ 

PREV
click me!

Recommended Stories

India : షెఫాలీ వర్మ విధ్వంసం.. శ్రీలంక బేజారు! రెండో టీ20 టీమిండియాదే
5 Wickets in 1 Over : W W W W W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ లో కొత్త చరిత్ర