ధోని, డివిలియర్స్‌లలో కోహ్లీకి ఎవరంటే ఇష్టం..? ఛేజ్ మాస్టర్ చెప్పిందిదే..

Published : Apr 07, 2023, 10:26 AM IST
ధోని, డివిలియర్స్‌లలో  కోహ్లీకి ఎవరంటే ఇష్టం..? ఛేజ్ మాస్టర్  చెప్పిందిదే..

సారాంశం

IPL 2023: ఐపీఎల్  -16 లో బిజీగా గడుపుతున్న  ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీకి  టీమిండియా మాజీ సారథి  ఎంఎస్ ధోని,  సౌతాఫ్రికా మాజీ క్రికెటర్  ఏబీ డివిలియర్స్ తో సత్సంబంధాలే ఉన్నాయి.  కానీ.. 

ఆధునిక క్రికెట్ లో టీమిండియా మాజీ సారథి  మహేంద్ర సింగ్ ధోని,  దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ గురించి  తెలియనివాళ్లు ఉండరు. భారత క్రికెట్ జట్టుకు మూడు  ఐసీసీ ట్రోఫీలను అందించిన ధోని..   తన బ్యాటింగ్ విన్యాసాలతో   క్రికెట్ ప్రేక్షకులకు అలరించిన  డివిలియర్స్ లు ఈ ఆటలో  చాలా మందిపై ప్రభావం చూపినవారే.  కాగా   ఈ ఇద్దరితోనూ  ఛేజ్  మాస్టర్ విరాట్ కోహ్లీకి సత్సంబంధాలు ఉన్నాయి.  

టీమిండియాలో ధోని - కోహ్లీల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.  ధోనిని కోహ్లీ తోటి క్రికెటర్ కంటే కూడా ఒక గురువుగా భావిస్తాడు. ఇప్పటికీ   సందర్భం దొరికిన ప్రతీసారి  కోహ్లీ ఈ విషయాన్ని  బహిరంగంగానే వెల్లడిస్తాడు. 

ఇక కోహ్లీ - డివిలియర్స్ ల స్నేహం గురించి  కూడా అందరికీ తెలిసిందే.   ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ   ఈ ఇద్దరి బ్యాటింగ్ విన్యాసాలను  అలరించని అభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. మరి  ధోని - డివిలియర్స్ లో ఎవరంటే కోహ్లీకి బాగా ఇష్టం..? తాజాగా  ఛేజ్ మాస్టర్ కు ఈ ప్రశ్నే ఎదురైంది.  

ఐపీఎల్ టెలివిజన్ ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ లో  వచ్చిన ఓ టీవీ షో లో కోహ్లీకి ఈ ప్రశ్న ఎదురైంది.   ‘ఎంఎస్‌డీ, డివిలియర్స్.. వీరిలో  మీ ఫేవరేట్ క్రికెటర్ ఎవరు..?’అని  అడగ్గా  కోహ్లీ ముందు నవ్వి  ఆ తర్వాత చాకచక్యంగా సమాధానమిచ్చాడు. తనకు ఇద్దరూ  ఇష్టమని   చెప్పాడు.  ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. 

 

ఇదే వీడియోలో కోహ్లీ  తన ఇష్టాఇష్టాల గురించి పంచుకున్నాడు. తనకు ఫ్లిక్ షాట్ కంటే కవర్ డ్రైవ్ ఇష్టమని,  అడిలైడ్ ఓవల్ లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ లు ఆడినా  తనకు చిన్నస్వామి స్టేడియం అంటే మక్కువ ఎక్కువ అని చెప్పాడు. చాహల్ - గేల్ లో ఎక్కువ నవ్వించే  క్రికెటర్ గేల్ అని.. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అరిజిత్ సింగ్ పాటలంటే ఇష్టమని  చెప్పుకొచ్చాడు.గాయకుల విషయంలో  పంజాబ్ సింగర్ గురుదాస్ మన్  - అరిజిత్ సింగ్ ల మధ్య  ఎవర్నో ఒకరిని ఎంచుకోమనగా.. ‘ఇది చాలా టఫ్’ అని చివరికి  అరిజిత్ సింగ్ కే మొగ్గుచూపాడు.. తనకు కార్డియో కంటే వెయిట్ ట్రైనింగ్ వర్కవుట్ అంటేనే ఇష్టమని  చెప్పాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

India : షెఫాలీ వర్మ విధ్వంసం.. శ్రీలంక బేజారు! రెండో టీ20 టీమిండియాదే
5 Wickets in 1 Over : W W W W W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ లో కొత్త చరిత్ర