
ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అంచనాలకు మించి ఎక్కువగానే పర్ఫామెన్స్ చూపించింది. గత రెండు సీజన్లలో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానాల్లో నిలిచిన రాజస్థాన్ రాయల్స్, ఈసారి ఏకంగా ఫైనల్‌కి దూసుకువచ్చింది. ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ చేతుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది...
టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కంటే రాజస్థాన్ రాయల్స్‌కి ప్రెసెంటేషన్ టైమ్‌లో ఎక్కువ అవార్డులు దక్కాయి. ఐపీఎల్ 2022లో 4 సెంచరీలతో 863 పరుగులు చేసి, సీజన్‌ని ముగించిన రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్, ‘ఆరెంజ్ క్యాప్’ గెలిచాడు.
ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు జోస్ బట్లర్. ఇంతకుముందు 2016 సీజన్‌లో విరాట్ కోహ్లీ 973 పరుగులు చేసి టాప్‌లో ఉండగా అదే సీజన్‌లో 848 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ రికార్డును అధిగమించాడు బట్లర్... ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు...
జోస్ బట్లర్ ఆరెంజ్ క్యాప్ గెలిస్తే, యజ్వేంద్ర చాహాల్ పర్పుల్ క్యాప్ సాధించాడు. 34 పరుగులు చేసిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హార్ధిక్ పాండ్యా వికెట్‌తో ఈ సీజన్‌లో 27 వికెట్లు పూర్తి చేసుకున్న చాహాల్, పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచాడు..
వికెట్ కీపర్‌గా అత్యధిక మందిని అవుట్ చేసిన ఘనత సంజూ శాంసన్‌కి దక్కగా సీజన్‌లో 17 క్యాచులు అందుకున్న రియాన్ పరాగ్, అత్యధిక క్యాచులు అందుకున్న ఫీల్డర్‌గా నిలిచాడు. జోస్ బట్లర్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ ఆఫ్ సీజన్‌గా నిలిచాడు...
పర్పుల్ క్యాప్ విన్నర్ యజ్వేంద్ర చాహాల్ భార్య ధనుశ్రీ వర్మ, ఫైనల్ మ్యాచ్ ముగిసి ప్లేయర్లు అందరూ బయో బబుల్‌ని వీడే సమయంలో ఆరెంజ్ క్యాప్ విన్నర్ జోస్ బట్లర్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. భార్య ధనుశ్రీ కొరియోగ్రాఫ్ చేస్తుంటే ముందుగా జోస్ బట్లర్‌తో కలిసి తాను కూడా డ్యాన్స్ చేయడం ఆరంభించిన యజ్వేంద్ర చాహాల్, ఆ తర్వాత కొద్దిసేపటికి పక్కకి వెళ్లి నిల్చుని వారిద్దరినీ చూస్తూ ఉండిపోయాడు...
డ్యాన్స్ మొత్తం అయిపోయిన తర్వాత తన సిగ్నేచర్ స్టెప్పుతో ముగించాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది ధనుశ్రీ వర్మ... ‘పర్పుల్ క్యాప్ విన్నర్, ఆరెంజ్ క్యాప్ విన్నర్ మధ్యలో నేను...’ అంటూ కాప్షన్ కూడా ఇచ్చింది...
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభం నుంచి జోస్ బట్లర్‌తో సన్నిహితంగా ఉంటూ, అతనితో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు యజ్వేంద్ర చాహాల్. జోస్ అంకుల్ అంటూ యజ్వేంద్ర చాహాల్ చేసిన పోస్టు, తాను బట్లర్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తానని... ఒకవేళ ఓపెనర్‌గా వచ్చి ఉంటే ఈజీగా 1000 పరుగులు చేసేవాడినని యజ్వేంద్ర చాహాల్ చమత్కారిస్తూ చేసిన కామెంట్లు, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి..