ఆ రెండు జట్లు లేకుండానే ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఐదేండ్లలో ఇదే తొలిసారి.. కొత్త ఛాంపియన్ ను చూస్తామా..?

Published : May 13, 2022, 11:31 AM IST
ఆ రెండు జట్లు లేకుండానే ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఐదేండ్లలో ఇదే తొలిసారి.. కొత్త ఛాంపియన్ ను చూస్తామా..?

సారాంశం

IPL 2022 Play Offs: ఐపీఎల్-2022 లీగ్  చరిత్రలో కొత్త చరిత్రను సృష్టించబోతున్నదా..?  ఈ సీజన్ లో ముంబై, చెన్నై కాకుండా అభిమానులు కొత్త విజేతను చూడబోతున్నారా..? తాజా పరిణామాలు, పాయింట్ల పట్టిక అవే  సూచిస్తున్నాయి. 

14 సీజన్లు ముగిసిన ఐపీఎల్ లో  ఆ రెండు జట్లదే ఆధిపత్యం. అయితే ట్రోఫీ లేకుంటే  రన్నరప్ అన్నట్టుగా సాగింది ఆ జట్ల విధ్వంసం. కానీ కాలం మారింది. అన్ని సీజన్లు అదే జట్లది ఆధిపత్యం అంటే  కుదురదుగా. ఈసారి  ఆ జట్లు కప్ గెలవడం పక్కనబెడితే ప్లేఆఫ్స్ కూడా ఆడటం లేదు.  ఆ రెండే ఐపీఎల్ లో  ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కాగా.. నాలుగు సార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్. గురువారం రాత్రి ఈ ఇరు జట్ల మధ్య  జరిగిన మ్యాచ్ లో ముంబై విజయం సాధించి పోతూ పోతూ చెన్నైని కూడా వెంట తీసుకెళ్లింది. గడిచిన ఐదేండ్లలో ఐపీఎల్ లో ఈ రెండు జట్లు  లేకుండా ప్లేఆఫ్ జరుగుతుండటం ఇదే ప్రథమం. అదీగాక ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్ కు వెళ్లకుండా ఒకే సీజన్ లో నిష్క్రమించడం కూడా ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

2015 సీజన్ లో ముంబై ఇండియన్స్-సీఎస్కే మధ్య జరిగిన ఫైనల్ లో ముంబైదే విజయం.  అయితే  ఆ తర్వాత సీజన్ లో ఈ రెండు జట్లు ప్లేఆఫ్ కు చేరలేదు. కానీ 2017 లో ముంబై దే ట్రోపీ. ఈ సీజన్ నుంచి వరుసగా ఐదేండ్ల పాటు ప్లేఆఫ్ లో ముంబై గానీ, సీఎస్కే గానీ లేకుండా  సీజన్ ముగియలేదు. 

ఆ ఘనతపై ఓ లుక్కేస్తే.. 

- 2017 లో రోహిత్ శర్మ ఫైనల్ చేరి ట్రోఫీ అందుకున్నాడు. 
- 2018 లో సీఎస్కే విజేత 
- 2019 లో  ముంబై విజేత (సీఎస్కే రన్నరప్)
- 2020లో ముంబైదే కప్ 
- 2021 లో చెన్నై కి ట్రోపీ 
కానీ 2022 లో ఈ రెండు జట్లు లీగ్ స్టేజ్ లోనే నిష్క్రమించాయి. ఐదేండ్ల తర్వాత ఈ రెండు జట్లు లేకుండానే ప్లేఆఫ్స్ జరుగుతున్నాయి. 

 

కొత్త ఛాంపియన్ కే అవకాశం...? 

తాజా పరిస్థితులు చూస్తే ఐపీఎల్-2022 సీజన్ లో కొత్త విజేతను చూసే అవకాశమే ఎక్కువ కనిపిస్తున్నది. ఐపీఎల్-15 సీజన్ లో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్  ప్లేఆఫ్స్ చేరింది. లక్నో సూపర్  జెయింట్స్ కూడా దాదాపు చేరినట్టే. ఇవి రెండూ ఈ సీజన్ లోనే లీగ్  లోకి ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో  చూస్తే మూడో స్థానంలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ కూడా మరో విజయం దూరంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో రెండు విజయాలు కావాలి.  వీటితో పాటు ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న ఢిల్లీ, హైదరాబాద్ కూడా ప్లేఆఫ్ రేసులో ఉన్నాయి. 

పైన పేర్కొన్న జట్లలో హైదరాబాద్, రాజస్తాన్ మినహా మిగిలిన నాలుగు జట్లు ఇంతవరకు కప్ కొట్టింది లేదు. ప్రస్తుత ఫామ్ ను బట్టి చూస్తే హైదరాబాద్ ప్లేఆఫ్స్ కు వెళ్లడం కష్టమే  అయినా అవకాశమైతే ఉంది. ఇక రాజస్తాన్ కూడా  ప్లేఆఫ్స్ కు వెళ్లి ఓడితే మాత్రం కొత్త ఛాంపియన్ ను చూడటం పక్కా. లక్నో, గుజరాత్ లను పక్కనబెడితే  బెంగళూరు కూడా ఇంతవరకు  ట్రోఫీ నెగ్గలేదు. ఢిల్లీది అదే పరిస్థితి. ఏదేమైనా రాజస్తాన్ ను మినహాయిస్తే ఈసారి కొత్త ఛాంపియన్ ను చూడటం  పక్కా అని భావిస్తున్నారు ఐపీఎల్ అభిమానులు. కానీ  ప్లేఆఫ్స్ లో రాజస్తాన్ ఆటతీరుపై కొత్త ఛాంపియన్ భవితవ్యం ఆధారపడి ఉంది. 

ఇప్పటివరకు 14 సీజన్లు ముగిసిన ఐపీఎల్ లో  ముంబై ఇండియన్స్ ఐదు సార్లు, సీఎస్కే నాలుగు సార్లు టైటిల్ నెగ్గాయి.  కోల్కతా, హైదరాబాద్ లు తలా రెండు సార్లు కప్ గెలిచాయి. రాజస్తాన్ రాయల్స్ తొలి సీజన్ విజేత. ప్రస్తుత సీజన్ కప్ రేసులో  రాజస్తాన్ రాయల్స్ తప్ప  మాజీ ఛాంపియన్లేవీ ఆ దరిదాపుల్లో లేవు. 

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !