Qualifier 2: ఆర్‌సీబీ బ్యాటర్లకు చుక్కలు... పటిదార్ పోరాడినా రాయల్స్ ముందు ...

Published : May 27, 2022, 09:18 PM IST
Qualifier 2: ఆర్‌సీబీ బ్యాటర్లకు చుక్కలు... పటిదార్ పోరాడినా రాయల్స్ ముందు ...

సారాంశం

Qualifier 2: ఆర్‌సీబీ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ప్రసిద్ధ్ కృష్ణ, ఓబెడ్ మెక్‌కాయ్... హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన రజత్ పటిదార్... 

ఐపీఎల్ 2022 రెండో క్వాలిఫైయర్‌లో ఆర్‌సీబీ వింటేజ్ రాయల్ ఛాలెంజర్స్‌ ఆటతీరును చూపించింది. ఎలిమినేటర్ మ్యాచ్ సెంచరీ హీరో రజత్ పటిదార్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా విరాట్ కోహ్లీ నుంచి ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ మూకుమ్మడిగా ఫెయిల్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేయగలిగింది ఆర్‌సీబీ... 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి శుభారంభం దక్కలేదు. ట్రెంట్ బౌల్ట్ వేసిన మొదటి ఓవర్ ఆఖరి బంతికి సిక్సర్ బాదిన విరాట్ కోహ్లీ, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

8 బంతుల్లో 7 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఈ సీజన్‌లో ఏడోసారి సింగిల్ డిజిట్ స్కోరు నమోదు చేశాడు. ఈ సీజన్‌లో టాపార్డర్‌లో 7 సార్లు సింగిల్ డిజిట్‌ అవుటైన మొదటి ప్లేయర్‌గా నిలిచాడు విరాట్.. ఇంతకుముందు ఆర్‌సీబీ తరుపున 2008లో ప్రవీణ్ కుమార్ 8 సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ కాగా 2009లో రాబిన్ ఊతప్ప, 2016లో క్రిస్ గేల్ 7 సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అయ్యారు...

9 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీని రజత్ పటిదార్, ఫాఫ్ డుప్లిసిస్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కి 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 27 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, ఓబెడ్ మెక్‌కాయ్ బౌలింగ్‌లో అశ్విన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

వస్తూనే రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 13 బంతుల్లో 24 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో మెక్‌కాయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో 111 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

ఎలిమినేటర్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన రజత్ పటిదార్, క్వాలిఫైయర్ 2లోనూ 50+ స్కోరు నమోదు చేశాడు. ఇంతకుముందు 2014లో సురేష్ రైనా, 2020లో కేన్ విలియంసన్ తర్వాత ఈ ఫీట్ సాధించిన మూడో బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రజత్ పటిదార్... 

ప్లేఆఫ్స్‌లో రెండుసార్లు 50+ స్కోర్లు చేసిన రెండో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు పటిదార్. ఇంతకుముందు 2021 సీజన్‌లో కేకేఆర్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ ఈ ఫీట్ సాధించాడు... 

42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేసిన రజత్ పటిదార్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. ప్లేఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా టాప్‌లో నిలిచాడు రజత్...

రెండు మ్యాచుల్లో కలిపి పటిదార్ 170 పరుగులు చేయగా, 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టన్ డేవిడ్ వార్నర్ 190 పరుగులతో టాప్‌లో ఉన్నాడు...  10 బంతుల్లో 8 పరుగులు చేసిన మహిపాల్ లోమ్రోర్, ఓబెడ్ మెక్‌కాయ్ బౌలింగ్‌లో అశ్విన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... 

భారీ ఆశలు పెట్టుకున్న దినేశ్ కార్తీక్ 7 బంతుల్లో 6 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో రియాన్ పరాగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, ఆ తర్వాతి బంతికే హసరంగని క్లీన్ బౌల్డ్ అయ్యాడు... 19వ ఓవర్ వేసిన ప్రసిద్ధ్ కృష్ణ 8 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీసి ఆర్‌సీబీని దెబ్బ తీశాడు.

ఓబెడ్ మెక్‌కాయ్ వేసిన 20వ ఓవర్ మొదటి బంతికే హర్షల్ పటేల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆఖరి ఓవర్‌లో 3 పరుగులు మాత్రమే చేయగలిగిన ఆర్‌సీబీ, చివరి 5 ఓవర్లలో 34 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది.

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?