హిందూ సంప్రదాయంలో మ్యాక్స్ వెల్ వివాహం.. ఫోటోలు వైరల్..!

Published : Mar 30, 2022, 04:52 PM IST
 హిందూ సంప్రదాయంలో మ్యాక్స్ వెల్ వివాహం.. ఫోటోలు వైరల్..!

సారాంశం

తమిళ సంప్రదాయం ప్రకారం.. వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను... వినీ రామన్.. తన ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేయగా... వీటికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్  మ్యాక్స్ వెల్ ఓ ఇంటివాడయ్యాడు. ఆయన  తాను ప్రేమించిన వినీ రామన్ ని వివాహమాడాడు.  ఐపీఎల్ సీజన్ 15 సమయంలో వీరి పెళ్లి జరగడం విశేషం. కాగా.. మ్యాక్స్ వెల్ పెళ్లి చేసుకున్న వినీ రామన్ ఓ భారతీయురాలు కావడం విశేషం. ఈ క్రమంలో.. తమిళ సంప్రదాయం ప్రకారం.. వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను... వినీ రామన్.. తన ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేయగా... వీటికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

 

గత కొంతకాలంగా ప్రేమించుకున్న వీరిద్దరూ కరోనా లాక్ డౌన్ కు ముందు 2020 ఫిబ్రవరిలో మ్యాక్ వెల్, వినీ రామన్ నిశ్చితార్థం జరుపుకొన్నారు. అప్పుడు ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. తాను త్వరలోనే ఓ ఇంటివాడ్ని కాబోతున్నాని మ్యాక్ వెల్ చెప్పుకొచ్చాడు. అయితే అంతలోనే కరోనా కేసులు క్రమంగా పెరిగిన కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించారు. ఈ కారణంగా వీరిద్దరి వివాహం రెండేళ్ల పాటు వాయిదా పడింది.  కాగా.. ఎట్టకేలకు ఇప్పుడు వారు ఘనంగా పెళ్లి చేసుకున్నారు.

కాగా.. పెళ్లి సమయంలో ఇరు కుటుంబాలు కలిసి దిగిన ఫోటోలను, పెళ్లి తంతులోని హల్దీ, మెహందీ ఫోటోలను సైతం వినీ రామన్ షేర్ చేశారు. పెళ్లి దుస్తుల్లో ఇద్దరూ మెరిసిపోతున్నారు. కాగా.. మ్యాక్స్ వెల్ పెళ్లికి అందరూ కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?