శిఖర్ ధావన్‌కి కొత్త జిమ్ పార్టనర్ దొరికిందోచ్... ఏకంగా ఫ్రాంఛైజీ ఓనర్‌ ప్రీతి జింటాతోనే...

By Chinthakindhi RamuFirst Published May 13, 2022, 5:17 PM IST
Highlights

ఆర్‌సీబీతో కీలక మ్యాచ్‌కి ముందు ఫ్రాంఛైజీ ఓనర్ ప్రీతి జింటాతో కలిసి జిమ్‌‌లో వర్కవుట్స్ చేసిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధావన్...

ఐపీఎల్ 2022 సీజన్‌లోనూ అంచనాలకు తగ్గ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు శిఖర్ ధావన్. గత ఆరు సీజన్లలోనూ 470+ పరుగులు చేసిన శిఖర్ ధావన్, ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున 11 మ్యాచుల్లో 42.33 సగటుతో 381 పరుగులు చేసి, ఫ్రాంఛైజీ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు...

గత మూడు సీజన్లలోనూ ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ 3లో ముగించిన శిఖర్ ధావన్, ఈ సారి టాప్ 6లో ఉన్నాడు. మిగిలిన మూడు మ్యాచుల్లో శిఖర్ ధావన్ చేసే పరుగులు, పంజాబ్ కింగ్స్‌కి కీలకంగా మారనున్నాయి. ఆర్‌సీబీతో మ్యాచ్‌కి ముందు శిఖర్ ధావన్‌లో ఫుల్లు జోష్ నింపేందుకు అతనికి జిమ్ పార్టనర్‌గా మారింది పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ సహ యజమాని ప్రీతి జింటా...

‘జిమ్‌లో కసరత్తులు చేయడానికి ఎవ్వరైనా ఇన్‌స్పిరేషన్ కావాలా? మేం మీ కోసం ఆ ఏర్పాటు కూడా చేశాం...’ అంటూ ప్రీతి జింటా, శిఖర్ ధావన్ కలిసి జిమ్‌లో వ్యాయమాలు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది పంజాబ్ కింగ్స్... 

Need inspiration to hit the gym? 💪

We got you covered! 💯 pic.twitter.com/Pt173uMq1S

— Punjab Kings (@PunjabKingsIPL)

టీ20ల్లో చోటు కోల్పోయిన భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్‌లో గత రెండేళ్లలో ఊహించని మలుపులు జరిగాయి... టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడాలని ఆశపడిన శిఖర్ ధావన్‌కి, భారత జట్టులో చోటు దక్కలేదు. ఐపీఎల్ 2021 సీజన్‌లో 500+ పరుగులు చేసిన స్ట్రైయిక్ రేటు తక్కువగా ఉందనే కారనంగా ధావన్‌ని కాదని, ఇషాన్ కిషన్‌ని టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఎంపిక చేశారు సెలక్టర్లు. ఈ నిర్ణయం భారత జట్టును ఘోరంగా దెబ్బ తీసింది...

అలాగే ప్రేమించి, పెళ్లి చేసుకున్న అయేషా ముఖర్జీతో గత ఏడాది విడాకులు తీసుకున్నాడు శిఖర్ ధావన్... ఫేస్‌బుక్‌లో పరిచయమైన అయేషా ముఖర్జీని ప్రేమించి పెళ్లాడాడు గబ్బర్. అప్పటికే అయేషా ముఖర్జీకి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నాయి. మొదటి భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న అయేషాను ఇష్టపడిన ధావన్, ఆమెను పెళ్లాడి 8 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు...

తనకంటే 10 ఏళ్లు పెద్దదైన అయేషా ముఖర్జీకి, శిఖర్ ధావన్‌కి ఎక్కడ చెడింది? ఎందుకు విడాకులు తీసుకున్నారనేది ఇప్పటివరకూ తెలియరాలేదు. విడాకుల తర్వాత తన కొడుకును కలిసి ఎమోషనల్ అయిన శిఖర్ ధావన్, వ్యక్తిగత జీవితంలో వచ్చిన అలజడులతో మానసికంగా కృంగిపోయాడట...

ఆ సమయంలో క్రికెట్‌ కూడా లేకపోవడంతో డిప్రెషన్ నుంచి బయటికి వచ్చేందుకు ఫిట్‌నెస్‌పై పూర్తి ఫోకస్ పెట్టాడు శిఖర్ ధావన్. జిమ్‌లో సాధ్యమైనంత ఎక్కువ సేపు గడుపుతూ పర్ఫెక్ట్ ఫిజిక్ సాధించాడు. 

ఐపీఎల్‌లో 6 వేల పరుగులు పూర్తి చేసుకున్న శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు... విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లో 6499 పరుగులు చేసి టాప్‌లో ఉండగా శిఖర్ ధావన్ 6 వేలకు పైగా పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ 5746 పరుగులతో, డేవిడ్ వార్నర్ 5668 పరుగులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు...

2017లో శిఖర్ ధావన్ 3300+ పరుగులతో ఉన్న సమయంలో రోహిత్ శర్మ దాదాపు 4 వేల పరుగులు (3986) పరగుులు చేయగా... నాలుగేళ్ల తర్వాత గబ్బర్ 6 వేల పరుగులు చేరగా... రోహిత్ అతనికి 300 పరుగుల దూరంలో నిలవడం విశేషం.. 

click me!