IPL 2022: కీలక మ్యాచ్ లో ఢిల్లీ బ్యాటర్లు విఫలం.. పంజాబ్ ముందు ఊరించే టార్గెట్

By Srinivas MFirst Published May 16, 2022, 9:14 PM IST
Highlights

TATA IPL 2022 PBKS vs DC: ఐపీఎల్ లో పడుతూ లేస్తూ వస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్..  కీలక ప్లేఆఫ్ రేసులో  చేతులెత్తేసింది.  బ్యాటర్ల వైఫల్యంతో ఆ జట్టు పంజాబ్ ముందు మోస్తారు లక్ష్యాన్ని నిర్దేశించింది.

ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన  పోరులో ఢిల్లీ క్యాపిటల్స్  బ్యాటర్లు చేతులెత్తేశారు. టాపార్డర్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ మినహా డేవిడ్ వార్నర్, రిషభ్ పంత్ విఫలమయ్యారు.  కీలక మ్యాచ్ లో పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఢిల్లీని కట్టడి చేశారు. లివింగ్ స్టోన్ బంతితో ఆకట్టుకున్నాడు. మూడు వికెట్లు తీసి  ఢిల్లీ  ప్రధాన బ్యాటర్లను  ఔట్ చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ.. 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే  చేయగలిగింది.  

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి బంతికే భీకర ఫామ్ లో ఉన్న డేవిడ్ వార్నర్ (0) వికెట్ ను కోల్పోయింది. లివింగ్ స్టోన్ వేసిన తొలి బంతికి వార్నర్.. రాహుల్ చాహర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కానీ ఆ తర్వాత  వచ్చిన మిచెల్ మార్ష్ (48 బంతుల్లో 63.. 4 ఫోర్లు, 3 సిక్సర్లు) తో జతకలిసిన సర్ఫరాజ్ ఖాన్ (16 బంతుల్లో 32.. 5 ఫోర్లు, 1 సిక్సర్) దూకుడుగా ఆడాడు.  

ఈ ఇద్దరూ కలిసి  ఫోర్లు, సిక్సర్లతో చెలరేగారు. రబాడా వేసిన రెండో ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు మార్ష్. హర్ప్రీత్ బ్రర్ వేసిన 3వ ఓవర్లో సర్ఫరాజ్ ఖాన్.. 6, 4, 4 కొట్టి ఆ ఓవర్లో 15 పరుగులు పిండుకున్నాడు. తర్వాత ఓవర్లో కూడా సర్ఫరాజ్.. రిషి ధావన్ వేసిన నాలుగో ఓవర్లో 4, 4 బాదాడు. దీంతో ఐదు ఓవర్లకే ఢిల్లీ స్కోరు 50 పరుగులు దాటింది. 

దూకుడుగా ఆడుతున్న ఈ జోడీని అర్షదీప్ విడదీశాడు. అతడు వేసిన ఐదో ఓవర్లో నాలుగో బంతికి సర్ఫరాజ్ ఖాన్ భారీ షాట్ ఆడబోయి మిడాన్ లో ఉన్న అర్షదీప్ కు చిక్కాడు. ఫలితంగా 51 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.  సర్ఫరాజ్ స్థానంలో వచ్చిన లలిత్ యాదవ్ (21 బంతుల్లో 24.. 1 ఫోర్, 1 సిక్సర్) ఉన్నంతసేపు మార్ష్ తో కలిసి స్కోరు వేగాన్ని తగ్గకుండా చూసుకున్నాడు. కానీ అతడిని కూడా అర్షదీప్.. 11వ ఓవర్ ఆఖరి బంతికి  ఔట్ చేశాడు. ఫలితంగా 98 పరుగులకే ఢిల్లీ 3 వికెట్లు కోల్పోయింది. 

షాకిచ్చిన లివింగ్ స్టోన్.. 

లలిత్ యాదవ్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రిషభ్ పంత్(7) ఎదుర్కున్న రెండో బంతికే సిక్సర్ బాదాడు. కానీ లివింగ్ స్టోన్ 12వ ఓవర్ ఐదో బంతికి అతడిని బోల్తా కొట్టించాడు. ముందుకొచ్చి ఆడటానికి ట్రై చేసిన పంత్.. స్టంపౌట్ అయ్యాడు.  ఆ తర్వాత వచ్చిన పావెల్ (2) కూడా ఎక్కువ సేపు నిలవులేదు. లివింగ్ స్టోన్ తన తర్వాత ఓవర్లో.. పావెల్ ను ఔట్ చేశాడు. దీంతో 14 ఓవర్లో ముగిసేసరికి ఢిల్లీ.. 5 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. 

 

Our and 's mood right now! 😁 pic.twitter.com/242pdGNmam

— Punjab Kings (@PunjabKingsIPL)

మార్ష్ హాఫ్ సెంచరీ.. 

వరుసగా వికెట్లు పడుతున్నా మార్ష్ మాత్రం పట్టుదలగా ఆడాడు. ఆఖరుదాకా క్రీజులో ఉండాలన్న పట్టుదలతో ఆడిన అతడు.. 17వ ఓవర్లో నాలుగో బంతికి ఫోర్ కొట్టి వరుసగా రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే క్రమంలో అర్షదీప్ వేసిన 18వ ఓవర్లో 3 ఫోర్లు బాదాడు. కానీ రబాడా వేసిన  19వ ఓవర్ రెండో బంతికి రిషి దావన్ కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.  ఆఖర్లో.. అక్షర్ పటేల్ (17*), శార్దూల్ ఠాకూర్ (3) ఉన్నా వాళ్లు పెద్దగా ప్రభావం చూపలేదు. 

పంజాబ్ బౌలర్లలో లివింగ్ స్టోన్ 4 ఓవర్లు వేసి 27 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా.. అర్షదీప్ కూడా 3 వికెట్లు పడగొట్టాడు. రబాడా కు ఒక వికెట్ దక్కింది. 

click me!