IPL 2022 CSK vs GT: తిరుగులేని టైటాన్స్... సీఎస్‌కేని చిత్తు చేస్తూ, మరో విజయం...

Published : May 15, 2022, 07:07 PM IST
IPL 2022 CSK vs GT: తిరుగులేని టైటాన్స్... సీఎస్‌కేని చిత్తు చేస్తూ, మరో విజయం...

సారాంశం

ఆడుతూ పాడుతూ ఐపీఎల్ 2022 సీజన్‌లో పదో విజయాన్ని అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్... వృద్ధిమాన్ సాహా అజేయ హాఫ్ సెంచరీ...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న ఏకైక జట్టు గుజరాత్ టైటాన్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌ని 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి, టాప్‌లో తన పొజిషన్‌ని మరింత పటిష్టం చేసుకుంది... ఐపీఎల్ 2022 సీజన్‌లో 10 విజయాలు అందుకున్న తొలి జట్టుగా నిలిచింది సీఎస్‌కే. 

134 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్‌కి శుభారంభం దక్కింది. 17 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, మతీశ పతిరాన బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఐపీఎల్ ఆరంగ్రేట మ్యాచ్ ఆడుతున్న పతిరాన, మొదటి బంతికే వికెట్ తీయడం విశేషం...

మాథ్యూ వేడ్ 15 బంతుల్లో 2 ఫోర్లతో 20 పరుగులు చేసి మొయిన్ ఆలీ బౌలింగ్‌లో శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 6 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసి పతిరాన బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. అయితే అప్పటికే గుజరాత్ టైటాన్స్ విజయం దాదాపు ఖాయమైపోయింది...

చేయాల్సిన పరుగుల కంటే కొట్టాల్సిన పరుగులు చాలా తక్కువ కావడంతో టైటాన్స్ బ్యాట్స్‌మెన్ ఏ మాత్రం కంగారు పడలేదు. డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా కలిసి నెమ్మదిగా ఆడుతూ ఎక్కడా కావాల్సిన రన్‌రేట్‌ పెరగకుండా జాగ్రత్త పడుతూ ఆడారు. వృద్ధిమాన్ సాహా బంతుల్లో 57 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 67 పరుగులు చేయగా డేవిడ్ మిల్లర్ 20 బంతుల్లో ఓ ఫోర్‌తో 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు... 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. 9 బంతుల్లో 5 పరుగులు చేసిన డివాన్ కాన్వే, మహ్మద్ షమీ బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 8 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది సీఎస్‌కే...

మొయిన్ ఆలీతో కలిసి రెండో వికెట్‌కి 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు రుతురాజ్ గైక్వాడ్. 17 బంతుల్లో 2 సిక్సర్లతో 21 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, సాయి కిషోర్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

మరో ఎండ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 44 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2022 సీజన్ ఫస్టాఫ్‌లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కి సెకండాఫ్‌లో ఇది మూడో హాఫ్ సెంచరీ. 

ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 10వ హాఫ్ సెంచరీ నమోదు చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఐపీఎల్‌లో 35 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు... ముంబై ఇండియన్స్ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 35 ఐపీఎల్ ఇన్నింగ్స్‌‌ల తర్వాత 1170 పరుగులు చేయగా, రుతురాజ్ గైక్వాడ్ 1205 పరుగులు చేసి టాప్‌లో నిలిచాడు. రిషబ్ పంత్ 1085 పరుగులు చేసి టాప్ 3లో ఉన్నాడు...

 49 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 53 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే శివమ్ దూబే 2 బంతులాడి డకౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్ 16, 17, 18, 19, 20 ఓవర్లలో ఒక్క బౌండరీ కొట్టలేకపోయాడు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్... ఫలితంగా సీఎస్‌కే ఇన్నింగ్స్ ఆఖరి 5 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే వచ్చాయి.

ఎమ్మెస్ ధోనీ వంటి భారీ హిట్టర్ కూడా రిస్కు తీసుకోవడానికి ఇష్టపడకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. 10 బంతుల్లో 7 పరుగులు చేసిన ఎమ్మెస్ ధోనీ, ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ మూడో బంతికి మహ్మద్ షమీ బౌలింగ్‌లో యష్ దయాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... 

సీజన్‌లో మొదటి సారి తుది జట్టులో చోటు దక్కించుకున్న ఎన్ జగదీశన్, 33 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !