పైసలతోపాటు ఇజ్జత్ కూడా దక్కింది... మోరిస్ పై ఫన్నీ మీమ్స్..!

Published : Apr 16, 2021, 09:26 AM ISTUpdated : Apr 16, 2021, 09:30 AM IST
పైసలతోపాటు ఇజ్జత్ కూడా దక్కింది... మోరిస్ పై ఫన్నీ మీమ్స్..!

సారాంశం

చివరి రెండు ఓవర్స్ లో వరసగా  నాలుగు సిక్సులు బాదాడు. వాటితో.. ఐపీఎల్ 14 సీజన్ రాజస్థాన్ రాయల్స్ తొలి విజయం అందుకుంది. దీంతో.. మోరిస్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.

క్రిస్ మోరిస్... ఐపీఎల్ వేలం సమయంలో ఎక్కువగా వినిపించిన పేరు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఎక్సెపెన్సివ్ క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. అతనిని రాజస్థాన్ రాయల్స్ ఎక్కువ ధరకు కొనుగోలు చేసింది. అయితే... ఈ సీజన్ మొదటి మ్యాచ్ లో మోరిస్ పెద్దగా ఆడిందేమీ లేదు. దీంతో.. అంత పెట్టి కొన్నా.. ప్రయోజనం లేదనే విమర్శలు వచ్చాయి. అయితే.. నిన్నటి మ్యాచ్ లో తానేంటో నిరూపించుకున్నాడు.

నిన్నటి మ్యాచ్ లో 18 బంతుల్లో 36 పరుగులు చేశాడు. అతని కారణంగానే గురువారం నాటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. చివరి రెండు ఓవర్స్ లో వరసగా  నాలుగు సిక్సులు బాదాడు. వాటితో.. ఐపీఎల్ 14 సీజన్ రాజస్థాన్ రాయల్స్ తొలి విజయం అందుకుంది. దీంతో.. మోరిస్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.

 

దీంతో.. ప్రస్తుతం మోరిస్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాడు. ఈ దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ ని అతని ఐపీఎల్ ప్రైస్ ట్యాగ్ పెట్టిమరీ.. డబ్బులు తగినట్టు ఆట ఆడాడు అంటూ పొగిడేస్తున్నారు.

ఇండియన్ సీనియర్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా మోరిస్ ఆటపై స్పందించాడు. తొలి మ్యాచ్ లో.. పైసలు మిగిలినయి కానీ.. ఇజ్జత్ దక్కలేదు. అని రెండో మ్యాచ్ లో పైసలతోపాటు.. ఇజ్జత్ కూడా దక్కిందంటూ పెట్టిన పోస్టు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 

PREV
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన