
ఆరెంజ్ ఆర్మీని ముందుండి నడిపించిన Sun Risers hyderabad మాజీ కెప్టెన్ వార్నర్ భాయ్ శకం ముగిసింది. ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న david warnerను జట్టు సారథిగానే గాక ఆటగాడిగా కూడా తొలగించిన SRH యాజమాన్యం.. తర్వాతి సీజన్ లో అతడు ఆడుతాడా..? లేదా..? అనే విషయమ్మీద నాన్చుతూ వచ్చింది. అయితే దీనిపై వార్నర్ క్లారిటీ ఇచ్చేశాడు. హైదరాబాద్ కు వార్నర్ భాయ్ గుడ్ బై చెప్పేశాడు.
అబుదాబి వేదికగా Mumbai Indiansతో మ్యాచ్ జరుగుతుండగా వార్నర్.. తన Instagram వేదికగా ఒక పోస్టు చేశాడు. అందులో.. ‘అద్భుతమైన జ్ఞాపకాలను పంచినందుకు అభిమానులందరికీ ధన్యవాదాలు. మా బృందానికి వంద శాతం మీరే చోధక శక్తులు. నాకు మద్దతిచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేను. ఇదో గొప్ప ప్రయాణం. నేను, నా కుటుంబం మిమ్మల్ని భాగా మిస్ అవబోతున్నాం. ఈరోజు జట్టు భాగా ఆడాలని ఆశిద్దాం..’ అంటూ రాసుకొచ్చాడు.
ఇది చూసిన హైదరాబాద్ అభిమానులు.. వార్నర్ భాయ్ నువ్వు మమ్మల్ని విడిచి వెళ్లొద్దు.. తర్వాత సీజన్ లో గొప్పగా రాణించాలి.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా నిన్నా మొన్నటిదాకా రైజర్స్ తో వార్నర్ ఉంటాడా..? ఉండడా..? అన్న దానిపై సందిగ్ధంలో ఉన్న అభిమానులు.. అతడి పోస్టుతో క్లారిటీ ఇచ్చేశాడు ఈ ఆస్ట్రేలియన్ ఓపెనర్. ఎనీ వే ఆల్ ది బెస్ట్ వార్నర్ భాయ్..!!