IPL2021 SRH vs MI: నిలబడిన సన్‌రైజర్స్ ఓపెనర్లు... ముంబై ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరి...

By Chinthakindhi RamuFirst Published Oct 8, 2021, 10:15 PM IST
Highlights

తొలి వికెట్‌కి 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జాసన్ రాయ్, అభిషేక్ శర్మ... అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై ఇండియన్స్...

ఐపీఎల్ 2021 సీజన్ ప్లేఆఫ్ రేసులో నిలవడానికి అవసరమైన భారీ స్కోరు చేసిన ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్‌ను స్వల్ప స్కోరుకి  కట్టడి చేయడంలో మాత్రం విఫలమైంది. బ్యాటింగ్‌కి అనుకూలిస్తున్న ఈ పిచ్‌పై 236 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఓపెనర్లు శుభారంభం అందించారు...

5.2 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. జాసన్ రాయల్ 21 బంతుల్లో 6 సిక్సర్లతో 34 పరుగులు చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ  11 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు..

తొలి వికెట్‌కే 64 పరుగుల భాగస్వామ్యం రావడంతో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కి చేరాలంటే కావాల్సిన 170+ తేడా కరిగిపోయింది. ఇప్పుడు మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించినా... కేవలం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంతో ముగించగలుగుతుంది. గత రెండు సీజన్లలో టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్... ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం ఆరో స్థానంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది... 

ముంబై ఇండియన్స్ రేసు నుంచి తప్పుకోవడంతో ప్లేఆఫ్ బెర్తులపై స్పష్టమైన క్లారిటీ వచ్చింది. ఎలిమినేటర్‌లో ఆర్‌సీబీ, కేకేఆర్ తలబడనుండగా, క్వాలిఫైయర్ 1లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలబడబోతున్నాయి...

click me!