IPL 2021: సన్‌రైజర్స్‌కి మరో ఎదురుదెబ్బ... రూథర్‌ఫర్డ్‌కి పితృ వియోగం...

Published : Sep 23, 2021, 08:43 PM ISTUpdated : Sep 23, 2021, 09:05 PM IST
IPL 2021: సన్‌రైజర్స్‌కి మరో ఎదురుదెబ్బ... రూథర్‌ఫర్డ్‌కి పితృ వియోగం...

సారాంశం

విండీస్ ఆల్‌రౌండర్ షెఫ్రాన్ రూథర్‌పర్డ్‌ తండ్రి కన్నుమూత... స్వదేశానికి బయలుదేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్... జానీ బెయిర్‌స్టో స్థానంలో రూథర్‌ఫర్డ్‌ను ఎంపిక చేసిన ఎస్‌ఆర్‌హెచ్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మరో ఊహించని షాక్ తగిలింది. జానీ బెయిర్ స్టో‌కి రిప్లేస్‌మెంట్‌గా ఎంపికైన విండీస్ ఆల్‌రౌండర్ షెఫ్రాన్ రూథర్‌పర్డ్ తండ్రి అనారోగ్యంతో మరణించారు. 

ఈ హఠాత్ సంఘటనతో ప్రస్తుతం యూఏఈలో బయో బబుల్‌లో ఉన్న రూథర్‌పర్డ్‌, తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు స్వదేశానికి పయనం కానున్నాడు... రూథర్‌ఫర్డ్ కూడా తప్పుకోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కష్టాలు మరిన్ని పెరగనున్నాయి...

ఇప్పటికే 8 మ్యాచుల్లో ఏడింట్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న సన్‌రైజర్స్, మిగిలిన మ్యాచుల్లో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది... 

ఐపీఎల్ ఫేజ్ 2 ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నటరాజన్ కరోనా బారిన పడడం, అతనితో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న కారణంగా విజయ్ శంకర్ కూడా ఐసోలేషన్‌కి వెళ్లడంతో ఇద్దరు ప్లేయర్లను దూరం చేసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్...

నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది సన్‌రైజర్స్ హైదరాబాద్. బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో విఫలమైన ఆరెంజ్ ఆర్మీ, కేన్ విలియంసన్ కెప్టెన్సీలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ చిత్తుగా ఓడింది...

PREV
click me!

Recommended Stories

Famous Batsmens : పసికూనలపైనే వీరి ప్రతాపం.. అభిమానులను బోల్తా కొట్టించిన టాప్ 5 క్రికెటర్లు
T20 World Cup : వన్ మ్యాన్ ఆర్మీ కోహ్లీ నుంచి హిట్‌మ్యాన్ రోహిత్ దాకా.. ఈ లిస్ట్ చూస్తే గూస్‌బంప్స్ పక్కా !