IPL 2021 RCB vs DC: టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. ఆఖరి పోరాటంలో విజేత ఎవరో..?

By team teluguFirst Published Oct 8, 2021, 7:09 PM IST
Highlights

IPL 2021 RCB vs DC: ఐపీఎల్ లీగ్ దశ ముగింపులో టేబుల్ టాపర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన రెండు జట్లకు  ఈ మ్యాచ్ నామమాత్రమే అయినా.. నేటి పోరులో గెలిచి ఆధిక్యత ప్రదర్శించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. 

ఐపీఎల్ లో లీగ్ దశ ముగింపునకు చేరింది.  దుబాయ్, అబుదాబి వేదికలుగా జరుగుతున్న రెండు మ్యాచ్ లతో లీగ్ దశకు తెరపడనుంది. ఈ నెల పదో తేది నుంచి నాకౌట్ దశ మొదలుకానుంది. కాగా, Playoffs కు ఆత్మవిశ్వాసంతో ముందడగు వేయాలని భావిస్తున్న టేబుల్ టాపర్స్ Delhi Capitals ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయింది. విరాట్ కోహ్లి సారథ్యంలోని ఆర్సీబీ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుంది.  ఈ సీజన్ లో అదిరిపోయే ఆటతో  పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు చేరిన ఢిల్లీ.. గత నాలుగు మ్యాచ్ లను గెలిచినట్టే ఈ పోరులోనూ నెగ్గి లీగ్ దశను విజయంతో ముగించాలని అనుకుంటున్నది. 

దుబాయ్ లో జరుగుతున్న 56వ ఈ మ్యాచ్ లో Virat Kohli సారథ్యంలోని Royal challengers Banhlore కూడా నేటి పోరులో నెగ్గాలని ప్రణాళికలు రచిస్తున్నది. ‘ఈసాలా కప్ నమదే..’ అంటూ ధీమాతో ఉన్న బెంగళూరు.. టోర్నీని ఎలాగైనా ఒడిసిపట్టాలని కోరుకుంటున్నది. గత మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఉత్కంఠ పోరులో ఆ జట్టు నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే నేటి పోరులో మాత్రం దానిని పునరావృతం చేయకూడదని భావిస్తున్నది. 

దీంతో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య అభిమానులకు నేటి సాయంత్రం అద్భుతమైన వింధు భోజనం దొరకడం ఖాయం. ఇరు జట్లలో హిట్టర్లు, ఆపదలో ఆదుకునే బ్యాట్స్మెన్, విరుచుకుపడే బౌలర్లకు కొదవలేదు. దీంతో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తున్నది. రెండు జట్లు గత మ్యాచ్ లో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నాయి.

విరాట్ కోహ్లి, పడిక్కల్, గ్లెన్ మ్యాక్స్వెల్, డివిలియర్స్ వంటి హిట్లర్లు ఆర్సీబీకి ఉండగా.. ఈ  సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన హర్షల్ పటేల్,  స్పిన్ తో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తున్న యుజ్వేంద్ర చాహల్ బెంగళూరుకు బలం. ఇక శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ లు ఢిల్లీ బ్యాటింగ్ లో మెరుపులు మెరిపిస్తున్నారు. బౌలింగ్ లో అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, రబాడ, నార్త్జ్ లు ఇరగదీస్తున్నారు. 

ఈ సీజన్ లో 13 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ.. 10 విజయాలతో పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మరోవైపు అంతే మ్యాచ్ లు ఆడిన బెంగళూరు.. 8 విజయాలతో మూడో స్థానంలో ఉంది. కాగా.. ఢిల్లీ, బెంగళూరు ఐపీఎల్ లో ఇప్పటివరకు 26 సార్లు ముఖాముఖి తలపడగా.. RCB 15 సార్లు గెలిచి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. DC 10 సార్లు నెగ్గింది. ఒక  మ్యాచ్ లో ఫలితం  తేలలేదు. 

ఈ రికార్డులు బద్దలవుతాయా..? 
1. 48 పరుగులు చేస్తే ఆర్సీబీ  ఆటగాడు Glenn maxwell ఐపీఎల్ ల్ రెండు వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్ అవుతాడు. ఇప్పటికే ఈ సీజన్ లో అతతడు 447 పరుగులు చేశాడు. 
2. మరో మూడు వికెట్లు తీస్తే ఒక ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా హర్షల్ పటేల్ కొత్త రికార్డును సృష్టిస్తాడు. ఈ  సీజన్ లో అతడు 29 వికెట్లు తీశాడు. ఐపీఎల్ లో ఒక సీజన్ లోఅత్యధిక వికెట్లు తీసిన రికార్డు బ్రావో (31)  పేరిట ఉంది. 
3. మరో నాలుగు వికెట్లు తీస్తే ఐపీఎల్ లో సిరాజ్ 50 వికెట్లు తీసిన బౌలర్ అవుతాడు. 
4. నాలుగు ఫోర్లు కొడితే విరాట్ కోహ్లి టీ20 క్రికెట్ లో 900 ఫోర్లు కొట్టిన క్రికెటర్ అవుతాడు. 

జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్:
రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిపల్ పటేల్, హెట్మెయిర్, అక్షర్ పటేల్, ఆర్. అశ్విన్, కగిసొ రబాడ, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్త్జ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్వెల్, ఏబీ డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్,  జార్జ్ గార్టన్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్ 

click me!