మాన్కడింగ్... ధావన్ కి పోలార్డ్ వార్నింగ్..!

By telugu news teamFirst Published Apr 21, 2021, 12:19 PM IST
Highlights

తర్వాత ఏమనుకున్నాడో తెలీదు.. వెంటనే మాన్కడింగ్ చేయకుండా.. ధావన్ కి వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు

ఐపీఎల్ 2021 సీజన్ లో మాన్కడింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా.. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ తలపడిన సంగతి తెలిసిందే. కాగా... ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ కి.. ముంబయి ఇండియన్స్ ఆల్ రౌండర్ పోలార్డ్ మాన్కడింగ్ చేయబోయాడు.

తర్వాత ఏమనుకున్నాడో తెలీదు.. వెంటనే మాన్కడింగ్ చేయకుండా.. ధావన్ కి వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌కి ఫస్ట్ వార్నింగ్ ఇవ్వకుండానే అశ్విన్ మాన్కడింగ్ చేయడంతో.. అప్పట్లో అదో పెద్ద వివాదమైంది.

అసలు ఏం జరిగిందంటే..? ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన కీరన్ పొలార్డ్.. మొదటి బంతిని విసరబోతుండగా.. అప్పటికే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని శిఖర్ ధావన్ క్రీజు వెలుపలికి వెళ్లిపోయాడు. దాంతో.. బౌలింగ్‌ని నిలిపివేసిన కీరన్ పొలార్డ్.. మాన్కడింగ్ చేసేందుకు వికెట్ల వైపు తిరిగాడు. కానీ.. ఆఖరి క్షణంలో ఆగిపోయి.. బంతి విసిరే వరకూ క్రీజులో ఉండాలని ధావన్‌కి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాడు. దాంతో.. తన తప్పిదాన్ని గ్రహించిన శిఖర్ ధావన్ మౌనంగా పొలార్డ్ వైపు చూస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

click me!