స్మిత్ ని కొనే ఆలోచన ఆర్సీబీకి లేదు.. అందుకే ఈ ప్లాన్ అంతా..!

By telugu news teamFirst Published Feb 24, 2021, 11:20 AM IST
Highlights

తమ ప్లాన్ లో భాగంగా స్మిత్ ని ఇతర జట్లు కొనుగోలు చేసేలా ప్లాన్ వేసినట్లు ఆ వీడియోలో వివరించింది.
 

త్వరలో ఐపీఎల్ సందడి ప్రారంభం కానుంది. ఐపీఎల్ 14వ సీజన్ కి సంబంధించి ఇటీవల వేలం కూడా జరిగింది. కాగా... ఈ వేలంలో స్టీవ్ స్మిత్  విషయంలో ఆర్సీబీ మాష్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. స్మిత్ ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.2 కోట్ల తక్కువ ధరకు దక్కించుకుంది. అయితే.. వేలంలో అతనిపై ఆర్సీబీ వేలం తొలుత పాడి.. ఆ తర్వాత వదిలేసింది. అయితే.. స్మిత్ ని వద్దని ఆర్సీబీ ముందే నిర్ణయించుకుందట. అందుకే.. ఎక్కువగా పాడకుండా వదిలేసింది.

ఈ విషయాన్ని ఆర్సీబీ జట్టు స్వయంగా వెల్లడించింది. అందుకు సంబంధించిన ఓ వీడియోని బోల్డ్ డైరీస్ పేరిట ట్విట్టర్ లో షేర్ చేసింది. తమ ప్లాన్ లో భాగంగా స్మిత్ ని ఇతర జట్లు కొనుగోలు చేసేలా ప్లాన్ వేసినట్లు ఆ వీడియోలో వివరించింది.

ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెసన్ ప్రణాళిక ప్రకారం... ఈ వేలంలో స్మిత్ ని కొనుగోలు చేయాలనే ఆలోచన ఆర్సీబీకి లేదు. ఎందుకంటే ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ బౌలింగ్ చేయలేడి హెసన్ పేర్కొన్నారు. తాము కొనుగోలు చేసే ఆటగాడు బ్యాట్ తోనే కాకుండా.. బంతితోనూ ఉపయోగపడాలని అనుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఆ జట్టు  స్టార్ ఆల్ రౌండర్ అయిన గ్లెన్ మ్యాక్స్ వెల్ ను రూ.14.25 కోట్ల అధిక ధరకు కొనుగోలు చేసింది.

అయితే.. స్మిత్ విషయంలో తొలుత వేలం పాట పాడి ఆ తర్వాత పక్కకు తప్పుకోవాలని తాము ముందే అనుకున్నట్లు హెసన్ పేర్కొన్నారు. ఒకవేళ చెన్నై జట్టు స్మిత్ ను దక్కించుకుంటే  అప్పుడు ఆర్సీబీ మ్యాక్స్ వెల్ ను దక్కించుకునే వీలు ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.

ఈ వేలంలో చెన్నై జట్టు తమకు గట్టి పోటీ ఇస్తుందని వారు భావించారు. ఒకవేళ తామే స్మిత్ ని కొనుగోలు చేయాల్సి వస్తే.. రూ..2కోట్లతో నష్టపోయేది ఏమీ లేదని వారు భావించారు. చివరకు స్మిత్ రూ.4కోట్లకు మించి ధర పలకడని వారు భావించారు. కాగా.. స్మిత్ గతేడాది రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడగా.. మెరుగైన ప్రదర్శన కనపరచలేదు. దీంతో అతనిని ఆ జట్టు వదిలేసింది. ఇక వేలంలో ఏ జట్టూ అతనిని కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. రూ.2కోట్ల కనీస ధరతో స్మిత్ ని ఢిల్లీ దక్కించుకుంది. 

click me!