ఇండియాకు తిరిగొచ్చాక నేను మొదట తినేది అదే.. తన ఫేవరేట్ ఫుడ్ చెప్పేసిన స్మృతి మంధాన

By team teluguFirst Published Oct 7, 2021, 2:37 PM IST
Highlights

Smriti Mandhana: భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. మూడు వన్డేల సిరీస్ ఓడిపోయిన భారత మహిళలు.. ఇటీవలే ముగిసిన Day and night Testలో మాత్రం ఇరగదీశారు. ఈ మ్యాచ్ లో మంధాన సెంచరీతో కదం తొక్కింది. 

భారత మహిళల  (INDw)జట్టు ఓపెనర్ స్మృతి మంధాన తనకు ఇష్టమైన ఫుడ్ గురించి చెప్పేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మంధాన.. భారత్ కు తిరిగొచ్చినాక తప్పకుండా దానిని మనసారా ఆరగిస్తానని చెప్పుకొచ్చింది. ట్విట్టర్  లో పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు మంధాన సమాధానం చెప్పింది. ఫేవరేట్ ఫుడ్, టీవీ షో వంటి విషయాలపై ఆమె తన అభిప్రాయాలను పంచుకుంది. 

‘INDIAకు తిరిగొచ్చిన తర్వాత నేను తప్పకుండా తినాలనుకునే ఐటెం భేల్ (భేల్ పూరి). ఎందుకంటే నాకు భేల్ అంటే చాలా ఇష్టం. దేశంలో ఎక్కడికెళ్లినా నేను దానిని మెనూలో ఉండేలా చూసుకుంటాను. కానీ ఇప్పుడు దానిని చాలా మిస్ అవుతున్నాను’ అని smriti mandhana చెప్పింది. అంతేగాక ఒకవేళ భారత మహిళల జట్టు గురించి ఏదైనా టీవీ షో చేస్తే.. అందులో మీ పాత్ర ఏ నటి పోషించాలని అనుకుంటున్నారు..? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రత్యేకించి తనకు అలాంటి పట్టింపులు ఏమీ లేవని, దర్శకుడు ఎవరితో తన పాత్రను చేయించినా సంతోషమే అని తెలిపింది. 

ఇటీవలే ఆసీస్ తో ముగిసిన డే అండ్ నైట్ టెస్టులో మంధాన అద్భుత శతకం సాధించి.. భారత్ తరఫున pink ball testలో వంద పరుగులు చేసిన తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 

 

I can't wait to eat ____ 😋 Watch to find out! pic.twitter.com/31PgFFe0Fi

— Smriti Mandhana (@mandhana_smriti)

మంధానతో పాటు మరో క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం చెప్పింది. గ్రౌండ్ లో మ్యాచ్ అయిపోయిన వెంటనే వెళ్లి తినే ప్లేయర్ పేరు చెప్పాలని అడగ్గా..  harman preet kaur తడుముకోకుండా భారత ఓపెనర్ shefali verma పేరు చెప్పింది. ఇక భారత జట్టులో నోబెల్ ప్రైజ్ శిఖా పాండేకు దక్కుతుందని కామెంట్ చేసింది. ఈ ఇద్దరికీ సంబంధించిన వీడియోలు  ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

 

Nobel Prize? 🏆
Eating food off the floor? 🍝
Find out who in the team is most likely to! . pic.twitter.com/OVm7A0BKLZ

— Harmanpreet Kaur (@ImHarmanpreet)

వన్డే, టెస్టు సిరీస్ ల తర్వాత Ausw తో భారత్ నేడు తొలి టీ20 ఆడుతున్నది. ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. నాలుగు ఓవర్లు ముగిసే సరికి భారత్ మంధాన (17), షెఫాలి వర్మ (18) ల వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసింది. 

click me!