IPL 2021 CSK vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. అగ్రశ్రేణి జట్లలో టాపర్ ఆఫ్ ది బ్యాచ్ అయ్యేదెవరు?

By team teluguFirst Published Oct 4, 2021, 7:13 PM IST
Highlights

IPL 2021 CSK vs DC: ఐపీఎల్ లో మరో ఆసక్తికరమైన పోరుకు తెరలేచింది. టేబుల్ టాపర్లు (Table Toppers)గా ఉన్న రెండు అగ్రశ్రేణి జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ప్లే ఆఫ్స్ (Ipl Play Offs) కు ముందు జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఎలాగైనా నెగ్గి ఆధిపత్యం ప్రదర్శించాలని చెన్నై సూపర్ కింగ్స్ (chennai super kings), ఢిల్లీ క్యాపిటల్స్ (delhi capitals) భావిస్తున్నాయి. 

పాయింట్ల పట్టికలో చెరో 18 పాయింట్లతో సమానంగా ఉన్న రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. నెట్ రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో చెన్నెై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్ లో ఎవరు గెలిచినా వాళ్లు టేబుల్ టాపర్లుగా నిలుస్తారు. కాగా, ఈ  ఆసక్తికర పోరులో బర్త్ డే బాయ్ రిషభ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. 

దుబాయ్ వేదికగా జరుగుతున్న 50 వ మ్యాచ్ లో ఎలాగైనా నెగ్గి ఆత్మవిశ్వాసంతో ప్లే ఆఫ్స్ కు అడుగేయాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు తుది జట్టులో పలు మార్పులు చేశాయి. ఢిల్లీ తరఫున ఆల్ రౌండర్ రిపల్ పటేల్ ఐపీఎల్ అరంగ్రేటం చేశాడు. ఇక చెన్నై మూడు మార్పులు చేసింది. సామ్ కరన్, కెఎం ఆసిఫ్, రైనా స్థానంలో బ్రావో, రాబిన్ ఊతప్ప, దీపక్ చాహర్ లను జట్టులోకి తీసుకున్నది.  

మ్యాచ్ నామమాత్రమే అయినా రెండు జట్లు ఆధిపత్యం ప్రదర్శించాలని పట్టుదలతో ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ (rajastan royals) తో రెండ్రోజుల క్రితం జరిగిన గత మ్యాచ్ లో అనూహ్యంగా ఓడిన సీఎస్కే (csk).. ఈ మ్యాచ్ లో ఎలాగైనా నెగ్గాలని భావిస్తున్నది. మరోవైపు గత మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను ఓడించి ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన ఢిల్లీ (dc) కూడా నేటి మ్యాచ్  లో చెన్నైపై పైచేయి సాధించాలని ఉవ్విళ్లూరుతున్నది. పటిష్టమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ తో ఉన్న రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగనుండటం ఖాయంగా కనిపిస్తున్నది. 

జట్లు: 
చెన్నై సూపర్ కింగ్స్:
 రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప, ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, హెజెల్వుడ్, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్ 

ఢిల్లీ క్యాపిటల్స్ : శిఖర్ ధావన్, రిపల్ పటేల్, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), హెట్మెయర్, అక్షర్ పటేల్, రబాడ, నార్త్జ్, అవేశ్ ఖాన్, అశ్విన్

click me!