ఐపీఎల్ లో క్రిస్ గేల్ ఎంట్రీపై కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే..

Published : Sep 25, 2020, 01:32 PM IST
ఐపీఎల్ లో క్రిస్ గేల్ ఎంట్రీపై కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే..

సారాంశం

ఈ టీమ్‌లో కీలక భాగస్వామి అయిన క్రిస్‌గేల్‌ను మొదటి 2 మ్యాచ్‌లలో ఆడించని సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఈ విధ్వంసకారుడి ఆట చూసేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.  


ఐపీఎల్ లో కింగ్ ఎలెవెన్ పంజాబ్ జట్టు దూసుకుపోతోంది. గురువారం బెంగళూరును చిత్తుగా ఓడించి తన సత్తా చాటుకుంది. కాగా.. ఈ మ్యాచ్ లో కెప్టెన్ కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. ప్రస్తుతం పంజాబ్‌ జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉండటం కొసమెరుపు. అయితే ఈ టీమ్‌లో కీలక భాగస్వామి అయిన క్రిస్‌గేల్‌ను మొదటి 2 మ్యాచ్‌లలో ఆడించని సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఈ విధ్వంసకారుడి ఆట చూసేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మైదానంలో గేల్‌ గేల్‌ అంటూ.. నినాదాలు చేస్తూ, ఎంట్రీ ఎప్పుడని అడుగుతున్నారు. గురువారం బెంగళూరుతో అట స్టార్ట్ అవ్వక మునుపే సారథి రాహుల్‌ను ఇదే ప్రశ్న అడగ్గా, అతడు ఆసక్తికరంగా స్పందించాడు. గేల్ సరైన సమయంలో, అవసరం వచ్చినపుడు తప్పక వస్తాడంటూ బదులిచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‌గేల్ ఆటను చూసేందుకు నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు.

PREV
click me!

Recommended Stories

IPL 2026 : CSK అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 14 కోట్ల ప్లేయర్ ఔట్ !
SRH Dangerous Batsmen : ఇషాన్ నుండి అభిషేక్ వరకు.. IPL 2026 లో టాప్ 5 డేంజర్ బ్యాటర్లు, లిస్ట్ లో ఒకేఒక్క తెలుగోడు