ఐపిఎల్ 2020: ధోనీ నిర్ణయానికి షాకైన సామ్ కరన్

Published : Sep 21, 2020, 08:39 AM ISTUpdated : Sep 21, 2020, 08:43 AM IST
ఐపిఎల్ 2020: ధోనీ నిర్ణయానికి షాకైన సామ్ కరన్

సారాంశం

తాను బ్యాటింగ్ కు దిగాల్సిన సమయంలో ముంబైపై సామ్ కరన్ ను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సామ్ కర్రాన్ పంపించారు. దానిపై సామ్ కర్రాన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

దుబాయ్: తమ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నిర్ణయానికి తాను కూడా ఆశ్చర్యపోయానని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎఎస్కే) ఆల్ రౌండర్ సామ్ కరన్ అన్నారు. శనివారం ముంబై ఇండియన్స్ మీద జరిగిన మ్యాచులో చెన్నై విజయం సాధించిన విషయం తెలిసిందే. 

ఈ ఆరంభ మ్యాచులో రవీంద్ర జడేజా అవుటైన తర్వాత ధోనీ బ్యాటింగ్ కు దిగాల్సి ఉండింది. అయితే సామ్ కరన్ ను తన కన్నా ముందు బ్యాటింగ్ కు దింపి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 

విజయానికి 17 బంతుల్లో 29 పరుగులు కావాల్సిన దశలో కర్నా కేవలం 6 బంతుల్లో 18 పరుగుుల చేసి చెన్నై విజయాన్ని సులభతరం చేశాడు. తొలి ఐదు బంతుల్లో సామ్ కరన్ రెండు సిక్స్ లు, ఓ ఫోర్ బాదాడు.  జస్ ప్రీత్ బుమ్రా బౌలింగులో అతను అవుటయ్యాడు.  ఆ తర్వాత ధోనీ, డుప్లెసిస్ కలిసి చైన్నై విజయాన్ని అందించారు.

అయితే, ధోనీ నిర్ణయం తనను కూడా ఆశ్చర్యపరిచిందని సామ్ కరన్ అన్నాడు. 18వ ఓవరులో ధాటిగా ఆడడంతో విజయం సులభమైందని అన్నాడు. మహీ జీనియస్ అని ప్రశంసించాడు.

PREV
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన