IPL 2020: విరాట్ కోహ్లీ లేకుండానే... డ్రీమ్11 కొత్త ప్రోమో!

Published : Sep 15, 2020, 12:36 PM ISTUpdated : Sep 15, 2020, 12:46 PM IST
IPL 2020: విరాట్ కోహ్లీ లేకుండానే... డ్రీమ్11 కొత్త ప్రోమో!

సారాంశం

Dream 11 కొత్త ప్రోమోను విడుదల చేసిన రోహిత్ శర్మ అండ్ కో... ఇక్కడెవ్వరూ స్టార్లు లేరని, అందరూ ప్లేయర్లేనంటూ చక్కగా చెప్పారని కొనియాడిన ఏబీ డివిల్లియర్స్... ప్రోమోలో కనిపించిన విరాట్ కోహ్లీ...

భారత్- చైనా మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి అర్ధాంతరంగా తప్పుకుంది చైనీస్ మొబైల్ కంపెనీ ‘వీవో’. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్ ‘డ్రీమ్ 11’కి దక్కింది.

మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ సీజన్ 13 ప్రారంభం కాబోతున్న సమయంలో ‘యెహా సబ్ సేమ్ హై, యే అప్‌నా గేమ్ హై’ (ఇక్కడ అందరూ సమానం, ఇది మన గేమ్) అంటూ గల్లీ క్రికెట్ యాప్ ప్రోమో రిలీజ్ చేసింది డ్రీమ్ 11. 


ఇందులో రోహిత్ శర్మ, శేఖర్ ధావన్, మహేంద్ర సింగ్ ధోనీ, జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్ వంటి ప్లేయర్లు గల్లీ క్రికెట్ ఆడుతూ కనిపించారు.

అయితే భారత సారథి విరాట్ కోహ్లీ మాత్రం ఈ ప్రోమోలో లేడు. దానికి కారణం కోహ్లీ ‘మొబైల్ ప్రీమియర్ లీగ్’ (MPL.live) సొంతంగా మొబైల్ గేమింగ్ యాప్‌ను రూపొందించడమే. ఎమ్‌పీఎల్‌కు ప్రచారకర్తగా ఉన్న కోహ్లీ, డ్రీమ్ 11 ప్రోమోలో కనిపిస్తే బాగుండదని నటించడానికి ఒప్పుకోలేదట.

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే