ధోనీ జట్టుకి బిగ్ రిలీఫ్... కరోనా నుంచి కోలుకున్న ఆ బ్యాట్స్‌మెన్...

Published : Sep 21, 2020, 05:43 PM IST
ధోనీ జట్టుకి బిగ్ రిలీఫ్... కరోనా నుంచి కోలుకున్న ఆ బ్యాట్స్‌మెన్...

సారాంశం

నెల రోజుల పాటు కరోనాతో పోరాడిన రుతురాజ్ గైక్వాడ్... ఎట్టకేలకు తాజాగా నిర్వహించిన రెండు పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు... మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగ మ్యాచ్‌లో రుతురాజ్ ఆడే అవకాశం..

దుబాయ్ చేరినప్పటి నుంచి దెబ్బ మీద దెబ్బ తిన్న చెన్నై సూపర్ కింగ్స్‌... మొదటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. అయితే కరోనా బారిన పడిన సీఎస్‌కే ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ కోలుకోకపోవడం వల్ల ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఆడలేదు. అయితే ఎట్టకేలకు రుతురాజ్ గైక్వాడ్ కరోనా నుంచి కోలుకున్నాడు. రుతురాజ్‌తో పెద్దగా లక్షణాలేవీ కనిపించినపోయినా నెల రోజుల పాటు కరోనాతో ఇబ్బంది పడ్డాడు.

ఎన్నిసార్లు కరోనా పరీక్షలు చేసినా పాజిటివ్ రావడంతో జట్టు సిబ్బంది కలవరపడ్డారు. అయితే ఎట్టకేలకు అతనికి నిర్వహించిన రెండు పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చింది. కరోనా నుంచి కోలుకోవడంతో జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నాడు రుతురాజ్. 23 ఏళ్ల రుతురాజ్ గైక్వాడ్, సురేశ్ రైనా లేని లోటును తీరుస్తాడని భావిస్తోంది చెన్నై సూపర్ కింగ్స్.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మురళీ విజయ్, షేన్ వాట్సన్ ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. దీంతో మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో విజయ్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కి ప్లేస్ దక్కొచ్చు.

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !